Bigg Boss 7 Telugu: తారుమారైన 12వ వారం ఓటింగ్ రిజల్ట్స్… టాప్ లో ఆ ఇద్దరు, డేంజర్ జోన్లో టైటిల్ ఫేవరేట్!

టాప్ లో ఉండే శివాజీ మూడో స్థానానికి పడిపోయాడు. రెండు వారాలుగా శివాజీ గేమ్ డల్ అయింది. పైగా అదే సమయంలో అమర్ కి సింపతీ ఓట్లు పడటంతో శివాజీని కిందకి నెట్టి అమర్ పైకి వెళ్ళిపోయాడు.

Written By: NARESH, Updated On : November 25, 2023 4:33 pm

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 12వ నామినేషన్స్ లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. కెప్టెన్ ప్రియాంక, శోభా శెట్టి మినహా మిగిలిన వారందరూ నామినేట్ అయ్యారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, అశ్విని, రతిక రోజ్, అంబటి అర్జున్, అమర్ దీప్, ప్రిన్స్ యావర్, గౌతమ్ నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు. అయితే ప్రశాంత్ అందరికంటే టాప్ లో ఉన్నాడు. రెండవ స్థానంలో అమర్ దీప్ కొనసాగుతున్నాడు. కాగా గత రెండు వారాలుగా అమర్ గ్రాఫ్ బాగా పెరుగుతుంది. అతను కెప్టెన్సీ కోసం పడుతున్న తపన .. బాధ చూసి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.

దీంతో టాప్ లో ఉండే శివాజీ మూడో స్థానానికి పడిపోయాడు. రెండు వారాలుగా శివాజీ గేమ్ డల్ అయింది. పైగా అదే సమయంలో అమర్ కి సింపతీ ఓట్లు పడటంతో శివాజీని కిందకి నెట్టి అమర్ పైకి వెళ్ళిపోయాడు. ఇక యావర్ నాలుగవ స్థానంలో ఉన్నాడు. ఐదవ స్థానంలో గౌతమ్ ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఐదుగురు సేఫ్ అని చెప్పొచ్చు. ఎలిమినేషన్ నుంచి బయట పడినట్లే. ఇక మిగిలిన .. అశ్విని, అర్జున్, రతిక రోజ్ వీరు ముగ్గురూ డేంజర్ జోన్ లో ఉన్నారు.

అర్జున్ చివరి నుండి మూడవ స్థానం .. అంటే ఆరో ప్లేస్ లో ఉన్నాడు. ఇక రతిక ఏమో ఏడవ స్థానంలో ఉండగా .. అశ్విని అతి తక్కువ ఓటింగ్ తో చివరి స్థానానికి పడిపోయింది. ఈ వారం డబల్ ఎలిమినేషన్ అంటున్నారు కాబట్టి .. ఈ ముగ్గురిలో ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

గత వారం కూడా అశ్విని డేంజర్ జోన్ లో కి వచ్చింది. దీంతో అశ్విని ఎలిమినేషన్ ఈ వారం పక్కా అంటున్నారు. మొదట ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత .. అర్జున్ లేదా రతిక ఎలిమినేట్ అవ్వచ్చు అని సమాచారం. కాగా ఈ వారం ఎవరు ఇంటి బాట పడతారు అనేది ఉత్కంఠగా మారింది. ఎవరు వెళ్తారో .. ఎవరు ఉంటారో చూడాలి మరి.