Akkineni family : సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇక్కడ స్టార్ స్టేటస్ ని అందుకోవాలంటే పెద్ద ఫ్యామిలీ ఉండాల్సిన అవసరం అయితే లేదు. మంచి కాన్సెప్ట్ లతో సినిమాలను చేసుకుంటూ వాళ్ళకంటూ సక్సెస్ రేట్ ని పెంచుకుంటూ పోతే ఎవరైనా సరే స్టార్ హీరోలుగా వెలుగొందుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పగానే నందమూరి, మెగా,అక్కినేని ఫ్యామిలీల పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. నిజానికి వీళ్ళ నుంచి వచ్చిన హీరోలందరూ వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా వారసత్వ పరంగా ఇండస్ట్రీకి వచ్చిన హీరోలు సైతం వాళ్ళ టాలెంట్ చూపిస్తూ స్టార్ హీరోలుగా ఎదుగుతున్నారు… ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరి మధ్య కొన్ని క్లాశేష్ అయితే వస్తున్నాయి. వాళ్ల మధ్య గొడవలు రావడమే కాకుండా ఎవరికి వారు సపరేట్ అయిపోతున్నారు… ఇక నందమూరి ఫ్యామిలీని చూసుకుంటే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు చెరొక వర్గంగా విడిపోయి ఎవరికి వాళ్లే సపరేట్ గా సినిమాలు చేసుకుంటూ ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఉంటున్నారు…ఇక మెగా ఫ్యామిలీ విషయానికొస్తే మెగా ఫ్యామిలీ హీరోగా కొనసాగిన అల్లు అర్జున్ ప్రస్తుతం అల్లు ఫ్యామిలీ గా తనకంటూ సపరేట్ ఐడెంటిటిని కోరుకోవడం తో కొంతమంది సినిమా విమర్శకులు సైతం వాళ్ల మీద విమర్శలైతే చేస్తున్నారు… ఇక మంచు మోహన్ బాబు కలెక్షన్ కింగ్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. తన ఫ్యామిలీలో హీరోలైన విష్ణు, మనోజ్ సైతం గొడవలు పెట్టుకొని ఎవరికి వాళ్లు సపరేట్ గా ఉంటున్న విషయం మనకు తెలిసిందే. ఇక రీసెంట్ గా మోహన్ బాబు కి మనోజ్ కి మధ్య భారీ గొడవ జరగడం పోలీస్ స్టేషన్ లో కేసుల వరకు వెళ్లడం మనం చూశాం…
మరి ఈ సందర్భాలన్నింటిని చూసినట్టైతే పెద్ద ఫ్యామిలీ అన్నింటిలో అక్కినేని ఫ్యామిలీ మాత్రమే ఎలాంటి గొడవలు లేకుండా చాలా గౌరవప్రదంగా ముందుకు సాగుతున్నారుని చెప్పాలి… నిజానికి నాగేశ్వరరావు తన కొడుకులను కూతుర్లను చాలా గౌరవంగా పెంచాడు. అందరికి అన్ని అందిస్తూ పెంచాడు.
ఇక అదే రీతిలో నాగార్జున కూడా తన కొడుకులను అలానే పెంచడంతో అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు తప్ప ఎవరి మధ్య ఈగో క్లాశేస్ అయితే రావడం లేదు. ముఖ్యంగా నాగార్జున అక్క కొడుకులు ఆయన సుమంత్, సుశాంత్ లు కూడా వాళ్లతో ఇప్పటికీ కలిసే ఉంటున్నారు అంటే అక్కినేని నాగేశ్వరరావు పెంపకం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు…
ఇక ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ కి సంబంధించిన ఒక వీడియో ను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అక్కినేని ఫ్యామిలీ గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. ఇక మిగిలిన ఫ్యామిలీన్నిటి కంటే కలిసి మెలిసి ఉండడంలో అక్కినేని ఫ్యామిలీకి ఉన్నతమైన స్థానం ఉందంటూ వాళ్ళు చెబుతుండడం విశేషం…