https://oktelugu.com/

Pawan Kalyan : అమరావతి లో పవన్ కళ్యాణ్ ని కలవబోతున్న అల్లు అర్జున్..ఆంధ్ర ప్రదేశ్ లో ‘పుష్ప 2’ విజయోత్సవ సభకు ముహూర్తం ఫిక్స్!

గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో మెగా, అల్లు కుటుంబాల మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడింది, రెండు కుటుంబాలు మాట్లాడుకోవడం లేదు అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : December 16, 2024 / 03:58 PM IST

    Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan : గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో మెగా, అల్లు కుటుంబాల మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడింది, రెండు కుటుంబాలు మాట్లాడుకోవడం లేదు అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఒకే ఒక్క సంఘటన అల్లు, మెగా రెండు వేర్వేరు కాదు, రెండు కుటుంబాలు ఒక్కటే అని అభిమానులకు మరోసారి అర్థం అయ్యేలా చేసింది. ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, చిరంజీవి దగ్గర నుండి కుటుంబం మొత్తం ఆందోళనకు గురవ్వడం, అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరు చేసే వరకు ఆయన ఇంట్లోనే చిరంజీవి, నాగబాబు వంటి వాళ్ళు ఉండడం, వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడం వంటివి జరిగాయి. అయితే నిన్న అల్లు అర్జున్ చిరంజీవి, నాగబాబు ఇళ్ళకు స్వయంగా వెళ్లి కలిసి వాళ్లకు కృతఙ్ఞతలు తెలియచేయడం సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

    దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానులు సోషల్ మీడియా లో షేర్ చేసుకొని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. అయితే అల్లు అర్జున్ తన చిన్న మేనమామ, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కూడా కలవబోతున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ నిన్న హైదరాబాద్ లోనే ఉండుంటే అల్లు అర్జున్ వెళ్లి కలిసేవాడు. కానీ ప్రస్తుతం ఆయన మంగళగిరి క్యాంప్ ఆఫీస్ లో ఉన్నాడు. మరో రెండు రోజుల్లో అల్లు అర్జున్ స్వయంగా పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది ని ఆయన అపాయింట్మెంట్ ని కూడా కోరాడట. అల్లు అర్జున్ తో పాటుగా బన్నీ వాసు, అల్లు అరవింద్, SKN వంటి వాళ్ళు కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి. అభిమానులు వీళ్లిద్దరు కలిసే క్షణాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కలిసిన రోజు నేషనల్ వైడ్ గా సెన్సేషనల్ టాపిక్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

    ఇదంతా పక్కన పెడితే త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ ‘పుష్ప 2’ విజయోత్సవ సభని గ్రాండ్ గా ప్లాన్ చేయబోతున్నారట మేకర్స్. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిథిగా పిలిచేందుకే అల్లు అర్జున్ మంగళగిరి కి పనిగట్టుకొని వస్తున్నదని సోషల్ మీడియా లో ఒక టాక్ వినిపిస్తుంది. ఈ భేటీ కి మరో కారణం కూడా ఉందంటూ సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది. అదేమిటంటే అల్లు అర్జున్ స్నేహితుడు, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి ప్రస్తుతం వైసీపీ పార్టీ లో ఉంటున్నాడు. ఈయన ఇప్పుడు జనసేన పార్టీ లోకి వచ్చేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నాడట. అల్లు అర్జున్ ఆయన కోసమే పవన్ కళ్యాణ్ తో భేటీ అవ్వబోతున్నాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఈ భేటీ తో అభిమానుల మధ్య ఉన్న మనస్పర్థలకు చెక్ పెట్టాలని ఆయన చూస్తున్నాడు.