https://oktelugu.com/

Akhanda: డల్లాస్​లో అఖండ విజయోత్సవం.. నెట్టింట్లో వీడియో వైరల్​

Akhanda: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా అఖండ. వీరిద్దరి కలయికలో సినిమా వస్తే.. ఊరమాస్​ ఉంటుందని ఈ పాటికే అందరికీ అర్థమైపోయింది. గతంలో వీరిద్దరు కలిసి తీసిన సింహా, లెజెండ్​ అభిమానులు, ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. ఈ సినిమా కూడా అదే రేంజ్​లో ఉండబోనుందని ట్రైలర్​, పాటలు చూడగానే అర్ధమైపోయింది. కాగా, బాలయ్య అంటే ఎంత స్పెషలో.. ఆయన ఫ్యాన్స్ కూడా అంతే స్పెషల్​. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాలయ్య అభిమానులు ఉన్నారు. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 2, 2021 / 09:59 AM IST
    Follow us on

    Akhanda: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా అఖండ. వీరిద్దరి కలయికలో సినిమా వస్తే.. ఊరమాస్​ ఉంటుందని ఈ పాటికే అందరికీ అర్థమైపోయింది. గతంలో వీరిద్దరు కలిసి తీసిన సింహా, లెజెండ్​ అభిమానులు, ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. ఈ సినిమా కూడా అదే రేంజ్​లో ఉండబోనుందని ట్రైలర్​, పాటలు చూడగానే అర్ధమైపోయింది. కాగా, బాలయ్య అంటే ఎంత స్పెషలో.. ఆయన ఫ్యాన్స్ కూడా అంతే స్పెషల్​. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాలయ్య అభిమానులు ఉన్నారు.

    Akhanda

    Also Read: Akhanda Twitter Review: మాస్.. ఊరమాస్.. బాలయ్య శివతాండవం..‘అఖండ’ మూవీ ట్విట్టర్ రివ్యూ

    ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ రోజు గ్రాండ్​గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే బెనిఫిట్​ షోకు మంచి టాక్ వచ్టింది. బాలయ్య సినిమా అంటే ఇది అంటూ సినిమా చూసినవాళ్లు అంటున్నారు. ఇక బాలయ్య ఫ్యాన్స్​ అయితే కాలర్​ ఎగరేసుకుంటూ మరి థియేటర్లలో నుంచి బయటకు వస్తున్నారు. తాజాగా, ట్విట్టర్​లో బాలయ్య ఫ్యాన్స్​కు సంబంధించిన ఓ వీడియో వైరల్​ అవుతోంది. డల్లాస్​లో అఖండ మాజ్​ జాతర జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ సినిమా విడుదలకు ఒకరోజు ముందుగానే విదేశాల్లో ప్రీమియల్​ అవనున్న సంగతి తెలిసిందే. అలా సినిమాను చూసిన డల్లాస్​లోని నందమూరి అభిమానలు ఏకంగా కార్ ర్యాలీనే నిర్వహించడం విశేషం. దీంతో సినిమాకు మరింత హైప్​ క్రియేట్​ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

    కాగా, ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్​ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్​, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించారు.

    Also Read: 83 Movie: 83 సినిమాలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కి డబ్బింగ్ చెప్పిన టాలీవుడ్ హీరో సుమంత్…