https://oktelugu.com/

Akhanda: బాలయ్య అఖండ హిట్​ టాక్​ అందుకోవాలంటే రాబట్టాల్సిన కలెక్షన్​ ఎంతో తెలుసా?

Akhanda: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ. ఈ సినిమా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​లోనే.. సినిమా తప్పకుండా భారీ విజయం సాధిస్తుందని అర్థమైంది. ఇప్పటికే అఖండ ప్రీరిలీజ్​ బిజినెస్​ భారీ రేంజ్​లో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద ఈ సినిమా చేసిన ప్రీ రిలీజ్​ బిజినెస్​ ఎంతో ఓ లుక్కేద్దాం. నైజాం : 10.5 కోట్లు,సీడెడ్ : 10.6 కోట్లు,ఉత్తరాంధ్ర […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 2, 2021 / 09:46 AM IST
    Follow us on

    Akhanda: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ. ఈ సినిమా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​లోనే.. సినిమా తప్పకుండా భారీ విజయం సాధిస్తుందని అర్థమైంది. ఇప్పటికే అఖండ ప్రీరిలీజ్​ బిజినెస్​ భారీ రేంజ్​లో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద ఈ సినిమా చేసిన ప్రీ రిలీజ్​ బిజినెస్​ ఎంతో ఓ లుక్కేద్దాం. నైజాం : 10.5 కోట్లు,సీడెడ్ : 10.6 కోట్లు,ఉత్తరాంధ్ర : 6 కోట్లు,తూర్పు గోదావరి : 4 కోట్లు,పశ్చిమ గోదావరి : 3.5 కోట్లు,గుంటూరు : 5.4 కోట్లు,కృష్ణా : 3.7,సిఆర్ నెల్లూరు : 1.8 కోట్లు,ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం : – 45.5 కోట్లు, కర్ణాటక+భారతదేశంలో : 5 కోట్లు, ఓవర్సీస్ : 2.5 కోట్లు,ప్రపంచ వ్యాప్తంగా మొత్తం  రూ.53కోట్లు.

    మొత్తంగా ఈ సనినమా ప్రీరిలీజ్​ రూ. 54కోట్లు సాధించింది. కరోనా వైరస్​ సెకెండ్​ వేవ్​ తర్వాత భారీ ప్రీరిలీజ్​ థియెట్రికల్​ బిజినెస్​ చేసిన తొలి బిగ్గెస్ట్​ మూవీ ఇదే. అయితే, ఆఖండ బాక్సాఫీసు వద్ద విజయం సాధించాలంటే.. ప్రీ రిలీజ్​ కంటే.. ఎక్కువ కలెక్షన్లు రాబట్టాలి. అంటే, దాదాపుగా రూ.60 కోట్ల కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది. తొలి షో నుంచే ఈ సినిమాకు వస్తోన్న పాజిటివ్ టాక్​ చూస్తుంటే.. సినిమా బ్లాక్​ బాస్టర్ కొట్టం ఖాయమనిపిస్తోంది.

    Also Read: Mega family: ఏపీలో వరద బాధితుల అండగా మెగా హీరోలు… విరాళాలు ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి, చరణ్

    మరోవైపు, బోయపాటి, బాలకృష్ణ కాంబోలో వస్తోన్న మూడో సినిమా అఖంట కావడం విశేషం. గతంలో వచ్చిన సింహా, లెజెండ్​ బాక్సాఫీసు వద్ద బంపర్​ హిట్​ కొట్టాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్​ అయితే.. వీరి కలయికలో వచ్చి హ్యాట్రిక్ హిట్​ చిత్రంగా నిలుస్తుంది. దానికి తోడు బాలయ్య కెరీర్​లోనే భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమా మంచి కలెక్షన్లు సృష్టించాలని అందరూ అనుకుంటున్నారు. కాగా, ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్​ నటించింది. జగపతి బాబు, శ్రీకాంత్​ కీలక పాత్రలు పోషించారు.

    Also Read: Akhanda Twitter Review: మాస్.. ఊరమాస్.. బాలయ్య శివతాండవం..‘అఖండ’ మూవీ ట్విట్టర్ రివ్యూ