Tollywood: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన కొత్త చిత్రం ‘డీజే టిల్లు’. ఇక ఈ సినిమాకి ‘అట్లుంటది మనతోని’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో నేహాశెట్టి కథానాయిక నటిస్తోంది. కొత్త దర్శకుడు విమల్ కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. అన్నట్టు ఈ సినిమాని అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
కాగా ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. కథానాయకుడు తన డీజే గొప్పతనం గురించి కథానాయికకు చెప్పే సన్నివేశంతో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం సందడిగా సాగింది. ట్రైలర్ లో మ్యాటర్ అని ఉందని అర్ధం అయింది.
అలాగే హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా చాలా బాగా నటించాడు. కాకపోతే.. అతని గెటప్ కొంచెం ఎబెట్టుగా అనిపించింది. ఇక ‘డీజే టిల్లు’ అనే టైటిల్ కూడా అస్సలు బాగాలేదు. మాస్ ఆడియన్స్ కి ఏ మాత్రం కనెక్ట్ అయ్యే విధంగా టైటిల్ లేదు.

Also Read: వైరల్ అవుతున్న సమంత కొత్త ఫోటోలు !
ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి వేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ప్రభుత్వం ఈడీకి సహకరించట్లేదని, కేసులో కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. దీంతో డ్రగ్స్ కేసులో పూర్తి వివరాలను ఈడీకి ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఈ మేరకు సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలకు కేసు ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. మొత్తానికి టాలీవుడ్ డ్రగ్స్ కేసు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు అందించింది.
Also Read: ప్రియమణి మళ్ళీ బికినీ వేస్తే చూడాలని ఉందట !
[…] […]