Akkineni Akhil Agent: ఏజెంట్ కొత్త లుక్ కేక.. కొత్త గెటప్ లో ‘అక్కినేని అఖిల్’ రచ్చ రచ్చే

Akkineni Akhil Agent: సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం మనాలిలో జరుగుతుంది. అక్కడ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారు. ఐతే, తన షూట్ కి సంబంధించి అఖిల్ తన లుక్ ను రివీల్ చేస్తూ ఒక ఫోటో పోస్ట్ చేశాడు. ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో అఖిల్ డిఫరెంట్ గెటప్ లో వైల్డ్ గా కనిపిస్తున్నాడు. దాంతో, అక్కినేని ఫ్యాన్స్ ఈ […]

Written By: Shiva, Updated On : May 29, 2022 10:59 am
Follow us on

Akkineni Akhil Agent: సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం మనాలిలో జరుగుతుంది. అక్కడ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారు. ఐతే, తన షూట్ కి సంబంధించి అఖిల్ తన లుక్ ను రివీల్ చేస్తూ ఒక ఫోటో పోస్ట్ చేశాడు. ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో అఖిల్ డిఫరెంట్ గెటప్ లో వైల్డ్ గా కనిపిస్తున్నాడు.

Akkineni Akhil

దాంతో, అక్కినేని ఫ్యాన్స్ ఈ ఫోటోను తెగ లైక్ అండ్ షేర్ చేస్తూ బాగా వైరల్ చేస్తున్నారు. స్పై థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, అఖిల్ అక్కినేని ఎంత కష్టపడినా ఇంకా సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. గుడ్డిలో మెల్ల లాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో ఓ ఏవరేజ్ హిట్ ను మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఆ సినిమాకు కూడా థియేటర్స్ నుంచి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు.

Also Read: Adani- YCP Government: అదానీ అడిగితే ఓకే.. ఏపీ సర్కారు తీరుపై పారిశ్రామికవర్గాల విస్మయం

దాంతో అఖిల్ బాగా నిరాశ పడ్డాడు. అయితే, ఆ నిరాశ నుంచి త్వరగా బయటకు వచ్చేసి మొత్తానికి తన కొత్త సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో దర్శకుడు సురేందర్ రెడ్డితో ఈ సినిమా చేస్తున్నాడు. పైగా ఈ ‘ఏజెంట్’ సినిమా కోసం అఖిల్ భారీ కసరత్తులు చేస్తూ సిక్స్ ప్యాక్ కూడా చేస్తున్నాడు. తన నరాలు కూడా ఎముకలు లాగా బలంగా లావుగా కనిపించేంతగా అఖిల్ ఈ సినిమా కోసం బాడీని పెంచాడు.

Akkineni Akhil

కండలు తిరిగిన దేహంతో ఒళ్ళు విరుచుకుంటూ అఖిల్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. నిజానికి అఖిల్ చాలా కాలంగా జిమ్ కే ఎక్కువ టైమ్ కేటాయించాడు. తన కష్టాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపిస్తాడట. ఈ సినిమాకి భారీ బడ్జెట్ పెడుతున్నారు. అఖిల్ మార్కెట్ స్థాయి కంటే రెట్టింపు పెట్టుబడి పెడుతున్నారు.

మెగాస్టార్ తో వందల కోట్ల బడ్జెట్ తో సైరా తీసిన సురేందర్ రెడ్డి ఆ సినిమా నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చాడు. మరి ఇప్పుడు అఖిల్ తో కూడా సురేందర్ రెడ్డి భారీ బడ్జెట్ ను పెట్టిస్తున్నాడు. మరి ఈ బడ్జెట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Also Read:Senior NTR: సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్ ఏమేం పనులు చేశారో తెలుసా?

Tags