https://oktelugu.com/

Ileana: ఓహో.. ఇలియానా పెళ్లి.. ఘనంగా ఏర్పాట్లు !

Ileana: గోవా సుందరి ఇలియానాకి సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేయాలనుకున్నారట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. కానీ అంతలో ఇలియానా సినిమాల్లోకి రావడం.. తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. అంతలో ఇలియానా కెరీర్ కూడా చాలా కాలం పాటు సాగింది. ఇంతలో ఆమె వయసు కూడా చాలా ముందుకు వచ్చేసింది. తెలియకుండానే ఇలియానా వయసు నాలుగేళ్లు తక్కువ నలభైకి వచ్చేసింది. అందుకే ఇలియానా పెళ్లి మీద సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వస్తూ ఉంటాయి. […]

Written By: , Updated On : April 26, 2022 / 06:06 PM IST
Follow us on

Ileana: గోవా సుందరి ఇలియానాకి సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేయాలనుకున్నారట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. కానీ అంతలో ఇలియానా సినిమాల్లోకి రావడం.. తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. అంతలో ఇలియానా కెరీర్ కూడా చాలా కాలం పాటు సాగింది. ఇంతలో ఆమె వయసు కూడా చాలా ముందుకు వచ్చేసింది. తెలియకుండానే ఇలియానా వయసు నాలుగేళ్లు తక్కువ నలభైకి వచ్చేసింది.

Ileana

Ileana

అందుకే ఇలియానా పెళ్లి మీద సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వస్తూ ఉంటాయి. కానీ, ఇంతవరకు ఇలియానా పెళ్లి పై మాత్రం ఎవరికీ క్లారిటీ రాలేదు. అయితే మరోసారి ఇలియానా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వినయ్ అనే తమ దగ్గరి బంధువును ఇలియానా పెళ్ళి చేసుకోబోతుందని ఆ వార్తల సారాంశం.

Also Read: Tollywood Hero: ఈ సినిమాని తెలుగులో మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

ఇప్పటికే ఎన్నో సార్లు ఇలియానా డేటింగ్ లో ఉన్నట్టు రూమర్లు వచ్చాయి. ముఖ్యంగా అజయ్ దేవగణ్ తో ఇలియానా ప్రేమలో ఉన్నట్లు ఏళ్ళ తరబడి గాసిప్పులు పుట్టుకొచ్చాయి. ఈ విషయం పై ఆ హిందీ హీరోతో పాటు ఇలియానా కూడా ‘మా మధ్య ప్రేమ ఏమి లేదు’ అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అందుకే, ఆ రూమర్లు మాత్రం ఆగలేదు.

Ileana

Ileana

ఆ తర్వాత ఇలియానా ఓ ఫార్నర్ తో ప్రేమలో మునిగి తేలింది. అది మూడునాళ్ళ ముచ్చట అయింది అనుకోండి. అయితే తాజాగా ఇలియానా పెళ్లికి సిద్ధమవుతున్నట్లు ఓ రూమర్ బాగా వైరల్ అవుతోంది. ఇప్పటికే ఇలియానా కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు.. త్వరలోనే పెళ్లికి సంబంధించిన అప్ డేట్ ను కూడా అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

అందుకే ఇలియానా కూడా కొత్త సినిమాలు కోసం ప్రయత్నాలు చేయడం లేదు అట. రీసెంట్ గా ఓ తమిళ కొత్త సినిమాలో అవకాశం వచ్చినా ఇలియానా ఒప్పుకోలేదు అట. కేవలం పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే ఇలియానా సినిమాలు ఒప్పుకోవడం లేదు అని చాలా బలంగా వినిపిస్తోంది. మరి ఈ సారైనా ఇలియానా పెళ్లి బాజాలు మోగుతాయేమో చూడాలి.

Also Read:Chiranjeevi Fans: కొరటాల శివ వల్ల ఆచార్య కి పెద్ద సమస్య.. ఆవేశం తో రగిలిపోతున్న ఫాన్స్

Recommended Videos:

Actress Samantha Spotted at Mumbai Airport || Samantha Latest Video || Oktelugu Entertainment

Ram Charan Confirms Multi Starrer Movie With Pawan Kalyan || Tollywood || Oktelugu Entertainment

Mega Star Chiranjeevi About Ram Charan Acting Skills || Acharya Movie || Oktelugu Entertainment

Tags