https://oktelugu.com/

Tollywood Hero: ఈ సినిమాని తెలుగులో మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Tollywood Hero: సూపర్ స్టార్ రజినీకాంత్ తో కబాలి లాంటి సినిమా చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని ఊపేసిన PA రంజిత్ కాస్త గ్యాప్ తీసుకొని ప్రముఖ తమిళ హీరో ఆర్య తో గత ఏడాది ‘సార్పట్ట పరంపర’ అనే సినిమాని తీసిన సంగతి మన అందరికి తెలిసిందే..2021 వ సంవత్సరం లో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న సమయం లో నేరుగా OTT లో విడుదల అయిన ఈ సినిమా అటు తమిళ్ లోను, […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 26, 2022 / 06:04 PM IST
    Follow us on

    Tollywood Hero: సూపర్ స్టార్ రజినీకాంత్ తో కబాలి లాంటి సినిమా చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని ఊపేసిన PA రంజిత్ కాస్త గ్యాప్ తీసుకొని ప్రముఖ తమిళ హీరో ఆర్య తో గత ఏడాది ‘సార్పట్ట పరంపర’ అనే సినిమాని తీసిన సంగతి మన అందరికి తెలిసిందే..2021 వ సంవత్సరం లో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న సమయం లో నేరుగా OTT లో విడుదల అయిన ఈ సినిమా అటు తమిళ్ లోను, ఇటు తెలుగులోనూ అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది..వాస్తవానికి ఈ సినిమా ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా చాలా మాములుగా విడుదల అయ్యింది..ఎందుకంటే PA రంజిత్ గత చిత్రం సూపర్ స్టార్ రజినీకాంత్ తో తీసిన కాలా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..ఆయన తీసిన కబాలి సినిమా కూడా అభిమానులు పెట్టుకున్న అంచనాలను కంటెంట్ పరంగా అందుకోలేదు..అప్పట్లో ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ ఉండడం వల్ల రజినీకాంత్ స్టామినా తో వసూళ్ల పరంగా సూపర్ హిట్ గానే నిలిచినప్పటికీ దర్శకుడు రంజిత్ మాత్రం కంటెంట్ పరంగా అభిమానుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయారు.

    అలా ఈ దర్శకుడి గత రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం తో ఆయన తీసిన సార్పట్ట పరంపర సినిమా పై ఎలాంటి అంచనాలు పెట్టుకోలేదు ప్రేక్షకులు..తన గత రెండు సినిమాలు లాగానే ఈ సినిమా లో కూడా వెనకబడిన కులాలని ఆధారంగా చేసుకొని బాక్సింగ్ నేపథ్యం లో చాలా సహజంగా తెరకెక్కించాడు..సినిమా చూస్తునంత సేపు ప్రతి ప్రేక్షకుడు ఉత్కంఠ తో చూసేలా మలిచాడు PA రంజిత్..అలా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమాకి అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి..హీరో ఆర్య కి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఈ సినిమా ద్వారా వచ్చాయి..డైరెక్టర్ కోరిన విధంగా తన శరీరాకృతిని మార్చుకోడానికి హీరో ఆర్య ఎంతో కష్టపడ్డాడు అనే చెప్పాలి..అయితే ఈ సినిమాలో ఆర్య కి ఎంత మంచి పేరు వచ్చిందో..ఇందులో విలన్ గా నటించిన జాన్ కొక్కెన్ కి కూడా మంచి పేరు వచ్చింది.

    Also Read: Sachin Tendulkar Daughter: హీరోయిన్ గా సచిన్ టెండూల్కర్ కూతురు.. తొలి సినిమా ఏ హీరోతోనో తెలుసా??

    వేటపులి పాత్రలో జాన్ కొక్కెన్ కనబర్చిన నటన ప్రేక్షకులకు గుర్తు ఉండిపొయ్యేలా చేసింది..ఇంతకీ జాన్ కొక్కెన్ మరెవరో కాదు..మన తెలుగు లో ప్రసారం అయిన బిగ్ బాస్ 2 లో ఒక్క కంటెస్టెంట్ గా పాల్గొన్న పూజ రామచంద్రన్ మన అందరికి గుర్తు ఉండేఉంటుంది..ఆమె భర్తనే ఈ జాన్ కొక్కెన్..అయితే ఈ పాత్ర కోసం తొలుత మన టాలీవుడ్ లో హీరో పాత్రలు మాత్రమే కాకుండా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న నవీన్ చంద్ర ని అడిగారు అట..ఈ పాత్ర ఆయనకీ ఎంతో నచినప్పటికీ అప్పటికే ఆయన వేరే సినిమాలకు కమిట్ అయ్యిపోవడం వల్ల డేట్స్ సర్దుబాటు చెయ్యలేక ఈ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది అట..ఇక సినిమా విడుదల అయిన తర్వాత ఆ సినిమాని చూసి మంచి పాత్రని మిస్ అయ్యాను అని ఫీల్ అయ్యాడట నవీన్ చంద్ర.

    Naveen Chandra

    Also Read: Prashant kishor: కాంగ్రెస్ కు ‘హ్యాండ్’ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్.. గట్టి షాక్

    Recommended Videos:

    Tags