Ileana Boyfriend: హీరోయిన్ ఇలియానా చేసిన పని ఇండియా వైడ్ సెన్సేషన్ అయ్యింది. పెళ్లి కాకుండానే తల్లి అయినట్లు ప్రకటించింది. అలాగే తనను తల్లిని చేసిన వ్యక్తి ఎవరో ఇంత వరకు బయటపెట్టలేదు. తాజాగా ఓ వ్యక్తి ఫోటో ఆమె పంచుకున్నారు. ఇలియానా ఇంట్లో అతడు పెట్ డాగ్ తో ఆడుకుంటున్నాడు. సదరు వ్యక్తి ఫోటో ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో ఇలియానా సహజీవనం చేస్తున్న వ్యక్తి ఇతనే అంటూ చర్చ మొదలైంది.
కాగా ఆ వ్యక్తి ముఖాన్ని ఇలియానా రివీల్ చేయలేదు. అతడు తల వంచుకొని ఉండగా ఆయన ఎవరో తెలియడం లేదు. మళ్ళీ ఇలియానా ఆ వ్యక్తి ఎవరో చెప్పకుండానే సస్పెన్సు లో చంపేసింది. కొందరి అంచనా ప్రకారం సెబాస్టియన్ అనే వ్యక్తి ఇందుకు కారణమట. సెబాస్టియన్ హీరోయిన్ కత్రినా కైఫ్ బ్రదర్. ఆ మధ్య సెబాస్టియన్, కత్రినా, విక్కీ కౌశల్ ట్రిప్ కి వెళ్లగా వాళ్లతో ఇలియానా కూడా జాయిన్ అయ్యింది.
సెబాస్టియన్-ఇలియానాల పరిచయం ప్రేమకు దారి తీసింది. వీరు సహజీవనం చేస్తున్నారనే వాదన ఉంది. ఇలియానా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో ఇలియానా ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ తో ప్రేమాయణం నడిపింది. ఏళ్ల తరబడి అతన్ని ప్రేమించింది. అనూహ్యంగా అతడు ఇలియానాకు హ్యాండ్ ఇచ్చి సొంత దేశం వెళ్ళిపోయాడు. ఈ బ్రేకప్ డిప్రెషన్ తో ఇలియానా చాలా కాలం బాధపడింది.
ఇక ఇలియానా దేవదాసు(2006)మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. పోకిరి మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టింది. పోకిరి చిత్రం ఇలియానాను ఓవర్ నైట్ స్టార్ చేసింది. సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతున్న రోజుల్లో ఇలియానా బాలీవుడ్ కి వెళ్లారు. ఆ నిర్ణయం ఇలియానా కెరీర్ ని నాశనం చేసింది. బాలీవుడ్ లో ఆమె సక్సెస్ కాలేదు. అదే సమయంలో సౌత్ ఆడియన్స్ ఆమెను మర్చిపోయారు. ప్రస్తుతం ఫేడ్ అవుట్ దశలో ఉంది.