Ileana: గోవా బ్యూటీ ఇలియానా డీక్రజ్ వయసు ప్రస్తుతం 35. పెళ్లి వయసు దాటిపోయినా ఇంకా పెళ్లి చేసుకోవా ? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు గానీ, నిజానికి ఇలియానాకి గతంలోనే పెళ్లి అయింది. ఆమె తన విదేశీ బాయ్ ఫ్రెండ్ ని ఘాడంగా ప్రేమించి పెళ్లాడింది. కాకపోతే, అతగాడు తుమ్మెద లాంటి వాడు. మకరందాన్ని ఆస్వాదించాక ఇక తన దారి తాను చూసుకున్నాడు. దాంతో ఇల్లీ బ్యూటీ పెళ్లి పెటాకులు అయింది.

దాంతో బాగా మానసికంగా నలిగిపోయింది. ఈ నేపథ్యంలో ఇలియానా మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు మొదలయ్యాయి. కానీ, ఆ తర్వాత ఆ వార్తలన్నీ ఒట్టి పుకార్లే అని తేలిపోయాయి. అయితే, తాజాగా ఇలియానా ఒక బాలీవుడ్ హీరోతో ఘాటుగా ప్రణయ బంధాన్ని కొనసాగిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అవి ఎప్పటికీ గుసగుసలు గానే ఉంటాయట. ఎందుకంటే.. ఆ హీరో గారికి ఇప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి.. ఆ హీరో గారితో తన బంధాన్ని రహస్యంగా మెయింటైన్ చేస్తూ వస్తోంది ఇలియానా. అందుకే, ఇక తాను ఇప్పట్లో పెళ్లి ఆలోచన చెయ్యడం లేదట. మొత్తానికి ఈ భామ మళ్ళీ పుకార్లతో సోషల్ మీడియాలో హీట్ పెంచుతుంది.
ఏది ఏమైనా ఈ గోవా బ్యూటీ అంటే సౌత్ ప్రేక్షకులకు ప్రత్యేక ప్రేమ ఉంది. తెలుగులోని స్టార్ హీరోల అందరితోనూ ఆడిపాడి హిట్లు కొట్టడంతో పాటు ఘాటు రొమాన్స్ కూడా చేసింది. ఆ తర్వాత హిందీ సినిమాల పై మోజు పడి అటు పోయినా అమ్మడు సన్నని నడుము పై హిందీ ప్రేక్షకులు మాత్రం ఆసక్తి చూపించలేదు. ఈ లోపు టాలీవుడ్ లో సైతం ఆమె ఫేడ్ అవుట్ అయింది.
Also Read: కంట్రోల్ చేసుకో పూర్ణ… అలా బుగ్గలు కొరికేస్తే ఎలా?
దీనికితోడు మధ్యలో బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ బాగా ఇబ్బంది పెట్టి, ఇలియానాకి నిద్ర లేకుండా చేశాడు. ఆ చేదు అనుభవాల నుంచి బయట పడటానికి మళ్ళీ సినిమా ప్రయత్నాలు చేస్తోంది. హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
మరోపక్క ఇన్ స్టాగ్రామ్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తోంది. మాల్దీవులకు చెందిన ఓ రిసార్ట్ కంపెనీతో ఒప్పందం చేసుకొని… ఆ రిసార్ట్ లో బికినీలు వేసుకుని తెగ తిరుగుతూ మొత్తానికి ఆ రిసార్ట్ ఫోటోలని పోస్ట్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది.
Also Read: యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం