అయినా ఏ డైరెక్టర్ అమ్మడుకు ఛాన్స్ ఇవ్వడం లేదు. పాపం, ఇలియానా ఎన్నో ఆశలతో బాలీవుడ్ కి వెళ్ళింది. తన ఒంపు సొంపులతో ఒక ఊపు ఉపాలనుకుంది. కానీ, ఏ మాత్రం ఇలియానాకి కాలం కలసి రాలేదు. అసలు తనకే ఎందుకు బొత్తిగా కలిసి రావడం లేదు అంటూ ఆ మధ్య ఓ స్వామిని కూడా నమ్ముకుంది.
కానీ ఆ స్వామి కూడా ఇలియానాని కష్టాల కడలి నుండి బయట పడేయలేకపోయాడు. దీంతో ఇక లాభం లేదనుకుని ఇలియానా సైడ్ బిజినెస్ మొదలు పెట్టిందని టాక్ మొదలైపోయింది. నిజానికి ఇలియానా గోవాలో చైన్ రెస్టారెంట్లు, బేకరీలు మొదలు పెట్టే ఆలోచనలో ఉందని ఆ మధ్య వార్తలు బాగా వచ్చాయి. అయితే తాజాగా మరో వార్త వినిపిస్తోంది.
ఇలియానా నిర్మాణంలోకి దిగబోతుంది. ఓటీటీల కోసం రెండు వెబ్ సిరీస్ లు నిర్మించే ఆలోచనలో ఉంది. పైగా ఆ సిరీస్ ల్లో మెయిన్ లీడ్ తానే. ఛాన్స్ లు లేకపోతే ఏమి, తానే ఛాన్స్ ను క్రియేట్ చేసుకుంటుంది ఇల్లీ బేబీ. లవ్ ఫెయిలైన తర్వాత చాన్నాళ్లు డిప్రెషన్ తో మగ్గిపోయిన ఇలియానా ఈ మధ్య చాలా మారిపోయింది. వినూత్నంగా ఆలోచించడం మొదలు పెట్టింది.