https://oktelugu.com/

Ileana: ఆ డైరెక్టర్ వేధింపులు తట్టుకోలేక ఇలియానా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందా..? బయటపడ్డ షాకింగ్ నిజం!

ఇలియానా గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె ఉద్వేగంతో మాట్లాడిన మాటలను ఆమె అభిమానులు సోషల్ మీడియా లో గుర్తు చేసుకుంటున్నారు. ఆమె మాట్లాడుతూ 'ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో నేను ఎన్నో లైంగిక వేధింపులను ఎదురుకున్నాను.

Written By:
  • Vicky
  • , Updated On : August 22, 2024 / 04:30 PM IST

    Ileana

    Follow us on

    Ileana:  యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు ఇలియానా. ముఖ్యంగా ఆమె నడుముకి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ప్రతీ అమ్మాయి తమ నడుము ఇలియానా కి ఉన్నట్టుగా ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకోని సందర్భం ఉండదు. ‘దేవదాసు’ చిత్రం తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఇలియానా, ఆ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆమెకి అవకాశాలు క్యూలు కట్టాయి. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా టాలీవుడ్ టాప్ స్టార్ హీరోలందరితో ఆమె సినిమాలు చేసింది. వాటిల్లో ఎక్కువ శాతం సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. అలా ఇండస్ట్రీ లోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి, అప్పట్లో సౌత్ లో కోటి రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్న అమ్మాయిగా చరిత్ర సృష్టించింది.

    అయితే ఏ హీరోయిన్ కి అయిన హిట్స్ లో ఉన్నన్ని రోజులే అవకాశాలు వస్తాయి, రెండు మూడు ఫ్లాప్స్ పడితే కొత్త హీరోయిన్స్ వెంట పడుతున్న దర్శక నిర్మాతలు. అలా ఇలియానా విషయంలో కూడా జరిగింది. ఆమెకి వరుస ఫ్లాప్స్ వచ్చిన సమయంలో కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టడం వల్ల ఇలియానా కి క్రేజ్ తగ్గిపోయింది. దీంతో ఆమె టాలీవుడ్ ని వదిలి బాలీవుడ్ కి వెళ్ళింది. అక్కడ పలు సినిమాల్లో నటించింది కానీ, అనుకున్న స్థాయిలో గుర్తింపుని అక్కడ సాధించలేకపోయింది. ఇక ఈ ఏడాది ఆమె హీరోయిన్ గా నటించిన రెండు బాలీవుడ్ సినిమాలు విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.

    ఇదంతా పక్కన పెడితే ఇలియానా గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె ఉద్వేగంతో మాట్లాడిన మాటలను ఆమె అభిమానులు సోషల్ మీడియా లో గుర్తు చేసుకుంటున్నారు. ఆమె మాట్లాడుతూ ‘ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో నేను ఎన్నో లైంగిక వేధింపులను ఎదురుకున్నాను. ఎంతోమంది డైరెక్టర్లు నాతో అసభ్యంగా వ్యవహరించేవారు. అందులో తెలుగు డైరెక్టర్స్ కూడా ఉన్నారు. ఒక డైరెక్టర్ అయితే తన కోరికని తీర్చమంటూ కమిట్మెంట్ అడిగాడు. ఆరోజు నేను చాలా ఏడ్చాను. వాడు అడిగిన కోరికని తీర్చలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. కానీ ఆ సమయంలో నన్ను నమ్ముకున్న కుటుంబం గుర్తుకొచ్చి ఆ ఆలోచనను విరమించాను. ఎవరో వెదవ అన్న మాటలకు నేను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి. వాళ్ళ డిమాండ్స్ కి లొంగకుండా, ఇదే ఇండస్ట్రీ లో రాణిస్తాను అని సవాలు చేసి, నిలబడి ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది ఇలియానా. ఇదంతా విన్న నెటిజెన్స్ అలాంటి స్టార్ హీరోయిన్ కి కూడా ఇండస్ట్రీ లో ఇలాంటి పరాభవాలు ఎదురయ్యాయి, ఇలా ఉంటే సంప్రదాయాలను నిక్కచ్చిగా అనుసరించే మన తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి వచ్చే సాహసం ఎలా చేస్తారు అంటూ సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఇలియానా ని అలా వేధించిన డైరెక్టర్ ఎవరో బయటపెట్టలేదు.