Rajamouli screenplay technique: రాజమౌళి దర్శక ధీరుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఇప్పటివరకు 12 సినిమాలు చేయగా అవన్నీ సూపర్ సక్సెస్ ని సాధించాయి… నిజానికి రాజమౌళికి మిగతా దర్శకులకు మధ్య ఉన్న తేడా ఏంటి అంటే ఆయన ఒక విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి సినిమాకి హెల్ప్ అవుతుందా? లేదా అనే ధోరణిలో ఒకటికి పది సార్లు దాన్ని క్రాస్ చెక్ చేసుకొని ఒక సీన్ ని రాసుకుంటాడు. అలాగే దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం కూడా చేస్తాడు…అందుకే ఆయనకి ఎక్కువగా సక్సెస్ లు దక్కుతున్నాయి… నిజానికి కష్టపడే తత్వం ఉన్న ప్రతి ఒక్కరికి సక్సెస్ లభిస్తోందని చెప్పడంలో రాజమౌళిని మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు…రాజమౌళి సినిమాలన్నింటిని మనం గమనిస్తే ఆయన ఎక్కువగా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ని వాడుతూ ఉంటాడు. అది ఎలా వాడాలో తెలిస్తే ఎవ్వరైనా సినిమా తీసేయవచ్చు. నిజానికి రాజమౌళి సింహాద్రి, విక్రమార్కుడు, మగధీర, బాహుబలి లాంటి సినిమాల్లో ఈ స్క్రీన్ ప్లే వాడి సూపర్ సక్సెస్ ని సాధించాడు.
ఇక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లో ఉన్న గొప్పతనం ఏంటి అంటే సినిమా ఫస్టాఫ్ లోనే సెకండాఫ్ కు సంబంధించిన భారీ ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు. దానివల్ల సెకండాఫ్ లో ఏదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందని ప్రేక్షకుడు ముందే పసిగడతాడు. అప్పటికి ఫస్టాఫ్ లో ఇచ్చే హై మూమెంట్స్ తో సెకండ్ ఆఫ్ మీద డెప్త్ అయితే పెరుగుతోంది. దానివల్ల ప్రేక్షకుడికి సెకండాఫ్ చూసినంతసేపు ఒక హై ఫీల్ కలుగుతోంది…
ముఖ్యంగా రాజమౌళి ఆ టెక్నిక్ ను వాడి వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు. నిజానికి కమర్షియల్ సినిమాల్లో చాలామంది నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేని వాడితే సూపర్ సక్సెస్ లు సాధించవచ్చు. ఎందుకంటే కమర్షియల్ సినిమా అనేది ఒక మీటర్ మీద ఉంటుంది. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఒక హై ఎలిమెంట్ రావాలి, అలాగే 30 నిమిషాలకు ఒకసారి ఒక ఫైట్ సీక్వెన్స్ ఉండాలి.
ఇక వాటన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎమోషన్ ని ప్రాపర్ వాడినప్పుడు సినిమా నెక్స్ట్ లెవల్లో ఉంటుంది… ఎక్కడైతే ఎమోషన్ డౌన్ అవుతుందో అక్కడ ఎలివేషన్, అలాగే ఫైట్ సీక్వెన్స్ కూడా అంత ఇంపాక్ట్ ఇవ్వదు. రాజమౌళి ఈ మూడింటిని ఒక్క తాటి మీద కి తీసుకొచ్చి సినిమాని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు… అందుకే ఆయనకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. అలాగే ఆయన సినిమాల్లో ఎలివేషన్స్ కూడా బాగా వర్క్ అవుట్ అవ్వడానికి ముఖ్య కారణం ఈయన వాడుతున్న నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అనే చెప్పాలి…