Lokesh Kanagaraj vs Sujeeth: సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా సత్తా చాటాలి అంటే అంత ఈజీ కాదు. ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు సాగాలి. కొన్ని విషయాల్లో కరాఖండిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు హేళన చేసినప్పటికి మన సినిమాతో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టైలిష్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో లోకేష్ కనకరాజ్ మొదటి స్థానంలో ఉంటాడు. తన ఎంటైర్ కెరియర్ లో చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికి ప్రతి సినిమాలో ఏదో ఒక వేరియేషన్ చూపిస్తూ వస్తున్నాడు. కార్తీ తో చేసిన ‘ఖైదీ’ సినిమా స్టోరీ మొత్తం ఒక్కరోజులో అయిపోయే కథగా రాసుకొని అందులో ఒక చిన్న పాప ఎమోషన్ ని ఆడ్ చేసి ప్రేక్షకులను మైమరిపింప చేశాడు. ఇక ఆ తర్వాత కమల్ హాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు…తన మేకింగ్ కి అభిమానులుగా మారిన వాళ్లు చాలామంది ఉన్నారు. లోకేష్ కనకరాజు లాంటి మేకర్ మరొకరు లేరు అంటూ చాలా రోజుల నుంచి చాలా వైరల్ చేస్తున్నారు. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ఓజీ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది.
ఈ మూవీ దర్శకుడు అయిన సుజిత్ స్టైలిష్ మేకర్ గా మరోసారి తనను తాను ఎలివేట్ చేసుకున్నాడు. ఇంతకుముందు ప్రభాస్ తో చేసిన సాహో సినిమా విజయాన్ని సాధించకపోయిన కూడా దర్శకుడిగా సుజీత్ కి మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
ఇక ఓజీ సినిమా మాత్రం సక్సెస్ ఫుల్ టాక్ తో ముందుకు దూసుకెళ్తూనే స్టైలిష్ మేకర్ గా తనను తాను ఎలివేట్ చేసుకోవడానికి చాలా వరకు దోహద పడింది. ఇక ప్రస్తుతం లోకేష్ కనకరాజు సుజీత్ ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. కారణం ఏంటి అంటే రీసెంట్ గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చిన కూలీ సినిమా ఆశించిన మేరకు విజయం సాధించలేదు.
రజనీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. కానీ సుజిత్ మాత్రం ఓజీ సినిమాతో ప్రేక్షకుల్లో ఒక భారీ హైప్ ను క్రియేట్ చేసి మొత్తానికైతే భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు… ఇక ఈ ఇద్దరు డైరెక్టర్ల కోసం స్టార్ట్ హీరోలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం విశేషం…. రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు అనే దాన్ని బట్టి వీళ్ళిద్దరిలో ఎవరు టాప్ పొజిషన్ కి వెళ్తారు అనేది డిసైడ్ చేయబడుతోంది అంటూ సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…