Pushpa 2 : ఇక సినిమా ఇండస్ట్రీలో భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలా మంది ఉన్నారు అందులో అల్లు అర్జున్ ఒకరు. తన ఎంటైర్ కెరియర్ లో కెరియర్ లో డిఫరెంట్ పాత్రలను పోషిస్తూ వస్తున్న ఆయన పుష్ప సినిమాతో ‘నేషనల్ అవార్డు’ ని కూడా అందుకున్నాడు… ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో రికార్డుల మోత మోగిస్తున్నాడనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. అందులో అల్లు అర్జున్ ఒకరు. ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప 2 సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ఆయన చాలావరకు ముందు వరుసలో ఉన్నాడనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఎలాంటి సక్సెస్ ని సాధించాలి అనే ధోరణి లోనే ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి స్టార్ డైరెక్టర్ తో ఇప్పటివరకు నాలుగు సినిమాలను చేసిన ఆయన ఆ నాలుగు సినిమాలతో మంచి విజయాలను అందుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో కి పాన్ ఇండియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఆయనతో సినిమాలు చేయడానికి ప్రస్తుతం పాన్ ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరు పోటీ పడుతుండటం విశేషం… ఇక ఇదిలా ఉంటే ఇప్పటివరకు పుష్ప 2 సినిమా దాదాపు 700 కోట్లకు పైన కలెక్షన్స్ ను అయితే రాబట్టింది. మరి ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టే అవకాశాలైతే ఉన్నాయి.
అయితే ఈ సినిమా బాహుబలి 2 సినిమా సృష్టించిన రికార్డును బ్రేక్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ రికార్డును బ్రేక్ చేసి దిశగా ఈ సినిమా ముందడుగులు వేస్తున్నప్పటికి అంతటి కలెక్షన్స్ సాధిస్తుందా తద్వారా ఈ సినిమా భారీ రికార్డులను నెలకొల్పుతుందా అనేది తెలియాల్సి ఉంది…
ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమాలో ఇలా చేసి ఉంటే సినిమా ఇంకా ఈజీగా భారీ సక్సెస్ సాధించి ఉండేది అంటు కొంతమంది సినీ విమర్శకులు ఈ సినిమా మీద కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు అవి ఏంటి అంటే ఇందులో బలమైన విలనిజం పోషించే క్యారెక్టర్ లేకపోవడం ఈ సినిమాకి చాలా వరకు మైనస్ అయిందని చెబుతున్నారు.
అలాగే ఫాహద్ ఫజిల్ క్యారెక్టర్ ని విలనిజం పోషించే క్యారెక్టర్ కోసం వాడుకున్నప్పటికి మధ్యలో అతన్ని కొంతవరకు కామెడీ సీన్ల కోసం వాడడం వల్ల ఆయన భారీ విలన్ అనే ఒక స్టేజ్ లో అయితే లేకుండా పోయాడు…