https://oktelugu.com/

Sameera Reddy : పెళ్ళికి ముందే అత్తారింటికి వెళ్లిన ఎన్టీఆర్ లవర్, ఓపెన్ గా చేసిన స్టార్ లేడీ!

హీరోయిన్ సమీరా రెడ్డి పెళ్లికి ముందే భర్తతో అత్తారింటిలో ఉన్నానని ఓపెన్ గా చెప్పింది. డేటింగ్ చేసినప్పటి పరిస్థితులు బయటపెట్టింది. ఎన్టీఆర్ మాజీ లవర్ అయిన సమీరా రెడ్డి చెప్పిన ఆసక్తికర సంగతులు ఏమిటో చూద్దాం

Written By:
  • S Reddy
  • , Updated On : November 17, 2024 / 09:48 AM IST

    Sameera Reddy

    Follow us on

    Sameera Reddy :  తెలుగు ఫాదర్, మంగళూరియన్ కొంకణి మదర్ కి సమీరా రెడ్డి ముంబైలో పుట్టింది. మోడలింగ్ ని కెరీర్ గా ఎంచుకున్న సమీరా రెడ్డి 2002లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె డెబ్యూ మూవీ మైనే దిల్ తుజ్ కో దియా. హిందీ చిత్రాలు చేస్తున్న సమీరా రెడ్డి 2005లో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. బి.గోపాల్-ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన నరసింహుడు చిత్రంలో సమీరా రెడ్డి హీరోయిన్ గా చేసింది. ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది. అనంతరం చిరంజీవికి జంటగా జై చిరంజీవా చిత్రంలో నటించింది.

    ఎన్టీఆర్ తో అశోక్ మూవీలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంది. అప్పుడే వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ పుకార్లు వెలువడ్డాయి. అశోక్ అనంతరం సమీరా రెడ్డి టాలీవుడ్ కి దూరమైంది. అందుకు కారణం ఎన్టీఆర్ తో ఎఫైర్ రూమర్స్ కూడా అని ఓ సందర్భంలో సమీరా రెడ్డి వెల్లడించారు. అలాగే ఎన్టీఆర్ సైతం ఒక హీరోయిన్ తో ప్రేమలో పడ్డానని తెలిపారు. అయితే తర్వాత రియలైజ్ అయ్యాను. ప్రొఫెషన్ ని పర్సనల్ లైఫ్ ని కలపకూడదు అని తెలుసుకున్నానని అన్నారు. ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ సమీరా రెడ్డి గురించే అనే వాదన ఉంది.

    ఎన్టీఆర్-సమీరా రెడ్డి పెళ్లి వరకు వెళ్లారని, హరికృష్ణ వీరి ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టాడనే మరో పుకారు కూడా ఉంది. చాలా గ్యాప్ తర్వాత కృష్ణం వందే జగద్గురుమ్ మూవీలో సమీరా రెడ్డి స్పెషల్ నెంబర్ చేసింది. కాగా 2014లో సమీరా రెడ్డి వ్యాపారవేత్త అక్షయ్ వర్ధేని వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక ఆమె సిల్వర్ స్క్రీన్ కి దూరమైంది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. వీరిది ప్రేమ వివాహం అట. పెళ్లికి ముందు కొన్నాళ్లు డేటింగ్ చేశారట.

    అక్షయ్ వర్ధే తల్లికి విడాకులు అయ్యాయట. ఆమె ఒంటరిగా ఉంటారట. ఈ క్రమంలో సమీరాతో ఎక్కడికి వెళ్లినా తల్లిని కూడా తీసుకొచ్చేవాడట. మనతో పాటు ఎప్పుడూ మా అమ్మ కూడా ఉంటుందని సమీరాకు ముందే చెప్పాడట. ఒకసారి సినిమాకు వెళితే తన తల్లిని వెంట తీసుకొని వచ్చాడట. సమీరాకు ఆశ్చర్యం వేసిందట. కొన్నిసార్లు రాత్రి ఆలస్యం అయితే అత్తారింటిలోనే సమీరా పడుకునేదట.

    పెళ్ళికి ముందే భర్త ఇంట్లో ఉండటానికి తన అత్త ఒప్పుకుందని సమీరా చెప్పుకొచ్చింది. అప్పటి నుండే అత్త తనకు సప్పోర్ట్ గా ఉంటుందని సమీరా వెల్లడించింది. సమీరా భర్త అక్షయ్ కంటే రెండేళ్లు వయసులో పెద్దది కావడం విశేషం.