Homeఎంటర్టైన్మెంట్Samantha: సమంత సాయంతో ఆ హీరోయన్​ ప్రాణాలు సేఫ్​!

Samantha: సమంత సాయంతో ఆ హీరోయన్​ ప్రాణాలు సేఫ్​!

Samantha: ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ కాలంలోనే టాప్​ హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకుంది సమంత. ఈ క్రమంలోనే నాగ చైతన్యను వివాహం చేసుకుని.. కెరీర్​లో మరింత ముందుకు దూసుకెళ్తోంది. వరుస సినిమా అవకాశాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అయితే, ఎవ్వరూ ఊహించని విధంగా చైతూ- సామ్​ల విడిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. వీరి విడాకుల ప్రకటన తర్వాత తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది సామ్​. సామ్​ను వ్యక్తిగతంగా  టార్గెట్​ చేస్తూ.. అసత్య ప్రచారాలు చేసిన యూట్యూబ్​ ఛానెల్స్​కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లి వాళ్ల నోరు మూయించింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో సినిమాలు, వెబ్​సిరీస్​లు చేస్తూ కెరీర్​పై దృష్టి సారిస్తోంది.

tejaswi

తాడాగా, సమంత గొప్పతనం చాటేలా ఓ వార్త వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్​ యంగ్​ బ్యూటీ తేజస్వి తనకు సమంత కేరీర్​లో ఎంత అండగా నిలిచిందో వివరించింది. అందరిలానే కేరీర్​ ప్రారంభంలో తానూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. చిన్న రోల్స్ చేసుకుంటూ.. ఇంటి నుంచి సపోర్ట్​ కూడా ఉండేది కాదని చెప్పింది.

కాగా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సమయంలో తాను టీబీ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. ఆ సమయంలో వైద్యులు ఆపరేషన్​ చేయించుకోవాలని సూచించారని చెప్పింది. కానీ, అంత డబ్బు ఆ సమయంలో తన వద్ద లేదని చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న సమంత.. తేజస్విని పిలిచి వైద్యానికి సంబంధించిన ఖర్చు మత్తం తానే భరిస్తానని సామ్​ ధైర్యం చెప్పినట్లు పేర్కొంది. ఇటీవల ఈ విషయం వెలుగురావడం వల్ల సామ్​పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు, సామ్ చేసే సేవా కార్యక్రమాలు అందరికీ తెలిసిందే. తాను ప్రారంభించిన ప్రత్యూష పౌండేషన్​ ద్వారా చిన్న పిల్లలకు ఉచితంగా వైద్యం అందిస్తోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular