Jailer 2 Movie Latest Updates: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో 50 సంవత్సరాల నుంచి నెంబర్ వన్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్న ఏకైక హీరో రజనీకాంత్… తమిళంతో పాటు తెలుగులో కూడా అతనికి భారీ మార్కెట్ అయితే క్రియేట్ అయింది. అతని సినిమాలన్నీ తెలుగులో డబ్ అవ్వడం వల్ల ఇక్కడ కూడా స్టార్ హీరోలతో పోటీపడి స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు…తెలుగులో సైతం అతని సినిమాలకి భారీ ఓపెనింగ్స్ వస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే రజనీకాంత్ వరుస సినిమాలతో తన మార్కెట్ ని పెంచుకుంటున్నాడు. ఈ సంవత్సరం వచ్చిన కూలీ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా 500 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టడంతో రజినీకాంత్ మార్క్ ఏ రేంజ్ లో ఉందో అందరికి అర్థమైంది. ఇక ప్రస్తుతం ‘జైలర్ 2’ సినిమాని చేస్తున్న రజినీకాంత్ ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. గతంలో వచ్చిన ‘జైలర్’ మూవీ 400 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. దాంతో ఇపుడు వస్తున్న ‘జైలర్ 2’ మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమా 1000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబడుతుందనే అంచనాలో తమిళ్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఉంది.
ఇప్పటివరకు తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా 1000 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టలేదు. కాబట్టి ‘జైలర్ 2’ సినిమా ఆ మార్క్ ను అందుకుంటుంది. అంటూ తమిళ సినిమా మేధావులు సైతం వాళ్ళ కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే నెల్సన్ రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ కి కథనైతే వినిపించాడు. తన తదుపరి సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ని అప్రోచ్ అయినట్టుగా తెలుస్తోంది…
ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా తర్వాత అతను త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేస్తాడు అంటూ గతంలో కొన్ని వార్తలు వచ్చాయి… కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే త్రివిక్రమ్ తన తదుపరి సినిమాని అల్లు అర్జున్ తో చేయబోతున్నాడు అంటూ రీసెంట్ గా ఒక అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది.
దాంతో ఇంకా వేరే సినిమాకి కమిట్ అవ్వలేదు. కాబట్టి నెల్సన్ డైరెక్షన్లో వస్తున్న జైలర్ 2 సినిమా సూపర్ సక్సెస్ అయితే నెల్సన్ తో జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…