Rajamouli: డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చాలా మంది చెబుతుంటారు. డాక్టర్ కొడుకు డాక్టర్, టీచర్ కొడుకు టీచర్ అవుతున్న రోజులివీ.అ యితే అవి కాకుంటే ఏమయ్యేవారంటే ఆసక్తికర సమాధానాలు వస్తాయి.

స్వతహాగా సినీ ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన రాజమౌళికి అందులో రాణించాలని చిన్నప్పటి నుంచే కోరిక ఉండేది. నాన్న విజయేంద్రప్రసాద్ మంచి కథా రచయిత కావడంతో ఆయననుంచి పాఠాలు నేర్చుకొని వివిధ రంగాల్లో పనిచేసి దర్శకుడిగా వరుస విజయాలు సాధించి బాహుబలితో ఇప్పుడు విశ్వవ్యాప్తం అయ్యారు.
అయితే దేశం గర్వించే గొప్ప దర్శకుడిగా ఎదిగిన రాజమౌళి నిజానికి తానకు దర్శకత్వం కంటే మరో ఇష్టం ఉందని తాజాగా బయటపెట్టాడు. శ్రీకాకుళం జిల్లా రాగోలు జెమ్స్ వైద్యకళాశాల స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు.
దర్శకుడు కాకపోయి ఉంటే ఏమయ్యేవారని ఓ విద్యార్థి లాజిక్ ప్రశ్నను రాజమౌళికి వేశారు. దీనికి రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. నాకు డ్రైవింగ్ అంటే ఇష్టమని.. నడపడం బాగా వచ్చు అని.. దర్శకుడిని కాకపోయి ఉంటే ఖచ్చితంగా డ్రైవర్ అయ్యేవాడిని అని రాజమౌళి చెప్పుకొచ్చాడు.
ఇక రాజమౌళి తను ఈ స్థాయి ఎదుగుతానని ముందే ఊహించారట.. తన తొలి సీరియస్ ‘శాంతినివాసం’ తీస్తున్న సమయంలోనే నాకు ఎందుకో అనిపించిందని రాజమౌళి సీక్రెట్స్ పంచుకున్నారు.పదేళ్ల తర్వాత ఖచ్చితంగా ఒక పెద్ద దర్శకుడిని అవుతానని అనుకున్నానని వివరించాడు.