https://oktelugu.com/

NTR : ఎన్టీయార్ ఆ ఒక్క విషయం లో మారకపోతే మాత్రం భారీగా నష్టపోవాల్సి ఉంటుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది.

Written By:
  • Gopi
  • , Updated On : December 10, 2024 / 02:01 PM IST

    NTR

    Follow us on

    NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఈ ఫ్యామిలీ చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా హీరోలుగా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక ఎప్పుడైతే వీళ్ళ నుంచి ఒక సినిమా వస్తుందని అనౌన్స్ అవుతుందో అప్పటినుంచి ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ అయితే మెయింటైన్ అవుతూ ఉంటుంది…

    నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ అభిమానులందరినీ తనవైపు తిప్పుకుంటున్నాడు. ఇక తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఈ స్టార్ హీరో రీసెంట్ గా దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించినప్పటికీ కలెక్షన్స్ మాత్రం భారీగా తీసుకురాలేకపోయింది. కారణం ఏదైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ఒక మార్కెట్ ను క్రియేట్ చేసుకోవడంలో కొంతవరకు వెనకబడ్డాడనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక విషయంలో మారాల్సిన అవసరమైతే వచ్చిందని తన అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అది ఏంటి అంటే స్టోరీస్ సెలక్షన్ లో జాగ్రత్తలు తీసుకుంటున్న ఆయన తన పరిధిని విస్తరించుకోవడంలో మాత్రం కొంతవరకు వెనుకబడ్డాడు. ఇక సినిమాకి హైప్ ను క్రియేట్ చేయడం కూడా ఆయన చాలావరకు వెనకబడ్డారనే చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా దేవర సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న ఆయన వరుసగా ఏడు విజయాలను సాధించిన హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి ఇకమీదట వచ్చే సినిమాలతో కూడా భారీ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనే విషయాల పట్ల సరైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మరి తను అనుకున్నట్టుగానే సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తే మాత్రం ఆయన మంచి విజయాలను సాధించడమే కాకుండా తన పరిధిని కూడా విస్తరించుకున్న వాడు అవుతాడు.

    ఇక వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించడమే కాకుండా పాన్ ఇండియాలో తన సత్తా చాటుకుంటడని చాలా గర్వంగా చెబుతున్నాడు.

    మరి ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది…

    ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ఎన్టీఆర్ చాలావరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది… ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు భారీ రేంజ్ లో ఉన్నప్పటికీ, ఇక మీదట కూడా తన సత్తాను చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది…