Mokshajna
Mokshajna : సినిమా ఇండస్ట్రీలోకి ఒక హీరో ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అయ్యాడు అంటే చాలు ఆయనకు సంబంధించిన హీరోలు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. ఎవరికి వారు వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకొని సక్సెస్ సాధిస్తే ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతారు. లేదంటే ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోతూ ఉంటారు. కానీ ఇండస్ట్రీలో మాత్రం వాళ్ల అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తూ ఉంటారు…
బాలయ్య బాబు (Balayya Babu) కొడుకు అయిన మోక్షజ్ఞ (Mokshagna) తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య బాబు చెబుతూ వస్తున్నప్పటికి అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఇక ఎట్టకేలకు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ గత కొన్ని రోజుల నుంచి కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. కానీ వీటి మీద ఎలాంటి స్పష్టత అయితే రావడం లేదు. ఇప్పటివరకు ఈ సినిమాని స్టార్ట్ చేయలేదు. వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అనౌన్స్ చేసి దాదాపు మూడు నుంచి నాలుగు నెలలు అవుతున్నప్పటికి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లడానికి ఇంకా ఎన్ని నెలలు పడుతుంది అనేదానిలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం బాలయ్య బాబు గాని, ప్రశాంత్ వర్మ గానీ ఆసక్తి చూపించడం లేదు. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రశాంత్ వర్మను పక్కన పెట్టి వేరే దర్శకుడితో మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పించాలని బాలయ్య బాబు ప్రయత్నం చేస్తున్నాడు. మరి దానికి తగ్గట్టుగానే మోక్షజ్ఞ మొదటి సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఆయన చేయబోయే సినిమా విషయంలో చాలావరకు అన్ని అంశాలు ఉండే విధంగా చూసుకుంటూ ఉంటాడు. అలాగే పాన్ ఇండియా సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.
ఇక ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు మొదటి సినిమాలతో డీలాపడ్డారు. తద్వారా వాళ్లకు స్టార్ హీరో ఇమేజ్ అయితే రావడం లేదు. అందుకే బాలయ్య బాబు మోక్షజ్ఞ విషయంలో అలాంటి తప్పు చేయకూడదని ఆచితూచి మరి ముందుకు సాగుతున్నాడు.
ఇక ఇదిలా ఉంటే మోక్షజ్ఞ చెయబోయే సినిమా భారీ విజయాన్ని అందుకుంటే మాత్రం అక్కినేని ఫ్యామిలీ హీరోల మీద భారీ దెబ్బ పడే అవకాశాలైతే ఉంటాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన ప్రతి హీరో కూడా స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇద్దరు హీరోలు ఎలాంటి సక్సెస్ లను సాధించకపోగా భారీ ఇమేజ్ ను కూడా సంపాదించుకోవడంలో కొంతవరకు వెనుకబడి పోతున్నారు.
కాబట్టి మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చిన హీరోగా ఎదిగితే అనేది అక్కినేని ఫ్యామిలీ హీరోలు చాలా వరకు వెనకబడి పోతారు. కాబట్టి మోక్షజ్ఞ ఏంటి అనేది అక్కినేని హీరోలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…