చందమామ ‘కాజల్ అగర్వాల్’ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’తో పాటు అక్కినేని నాగార్జున – ప్రవీణ్ సత్తారు కలయికలో వస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్లో కూడా నటిస్తుంది. అలాగే మరో తమిళ సినిమాలో కూడా కాజల్ నటిస్తోంది. మొత్తానికి పెళ్లి తర్వాత భర్తను దూరం పెట్టి మరీ, ఇలా వరుస సినిమాలు చేస్తోంది. అయితే కాజల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో ముచ్చటించింది.
ఈ సందర్భంగా ఓ అభిమాని ‘మీ భర్త కోసం మీ సినీ కెరీర్ త్యాగం చేస్తారా ?’ అని అడిగాడు. దానికి కాజల్ సమాధానమిస్తూ ‘నా భర్త గౌతమ్ కిచ్లూ నిజంగానే నన్ను సినీ రంగం నుంచి తప్పుకోమని కోరితే మరుక్షణమే ఇక నేను నటనకు గుడ్ బై చెప్పేస్తాను. అయితే, నాకు నా భర్త నుండి కావాల్సినంత మద్దతు ఉంది, కానీ నేను ఎప్పుడూ నా భర్త మాటకు విలువ ఇస్తాను’ అంటూ కాజల్ అగర్వాల్ సిగ్గు పడుతూ చెప్పింది.
ఇక కాజల్ తన భర్తతో అనుబంధం గురించి చెబుతూ ‘ఏ భార్య అయినా పెళ్లి తర్వాత, తన సమయాన్ని పూర్తిగా భర్తకే కేటాయిస్తోంది. భర్త సంతోషమే తన బాధ్యతగా భావిస్తోంది. అయితే, నా విషయంలో మాత్రం అంతా రివర్స్ లో జరిగింది. గౌతమ్ కి నా సంతోషమే ముఖ్యం. నా కోసం తన టైంను వదులుకున్నాడు. అందుకే, నేను ఇప్పటికీ నటన మీద ఎక్కువ దృష్టి పెట్టగలుగుతున్నాను’ అని చెప్పుకొచ్చింది కాజల్.
ఇక కరోనా కారణంగా గత ఏడాది నుంచి తనకు తన భర్తతో ఏకాంతంగా గడిపే అవకాశం వచ్చిందట. ఏది ఏమైనా కాజల్ కి మొదటి నుండి సినిమాలు, రెమ్యునరేషన్స్ అంటే ప్రాణం. వాటిని వదులుకొని కుటుంబం కోసం కాజల్ ఖాళీగా ఇంటికే పరిమితం అవ్వడం అసలు ఇష్టం లేదు. అందుకే వరుస సినిమాలు ఒప్పుకుంటే.. కొత్త అవకాశాల కోసం ఎప్పటికప్పుడు తాపత్రయ పడుతుంది.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: If he says i will say good bye to movies kajal
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com