Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే అందరికీ మెగాస్టార్ చిరంజీవి (Chirajeevi) గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అలాంటివి… మరి ఏది ఏమైనా కూడా ఆయనకంటూ సత్తా చాటుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉన్నాడు ఇప్పటివరకు కూడా చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు అంటే ఆయనకు సినిమా అంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు…
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిరంజీవి (Chiranjeevi) లాంటి ఒక నటుడు గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ వస్తున్నాడు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపును సంపాదించుకున్న ఆయనకి గతంలోనే గ్లోబల్ స్టార్ గా ఎదిగే అవకాశమైతే వచ్చింది. కానీ అనుకోని సందర్భాల్లో అవి తెరమీదకైతే రాలేకపోయాయి… ఇక హాలీవుడ్ మేకర్స్ కోలాబరేషన్ తో ‘బాగ్దాద్ గజదొంగ’ (Bagdad Gaja Donga) అనే సినిమాని చిరంజీవి చేయాల్సింది. 1998వ సంవత్సరంలో ఈ సినిమాని స్టార్ట్ చేశారు. అప్పట్లోనే 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాను హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయాలనే ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా హాలీవుడ్ వెర్షన్ కి భూషణ్ జెర్సీ దర్శకత్వం వహిస్తుండగా, తెలుగు వెర్షన్ కి సురేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తాడని క్లారిటీగా చెప్పేశారు. అయితే ఈ సినిమా చాలా గ్రాండ్ గా ఓపెనింగ్ జరుపుకుంది. అలాగే ఫస్ట్ షెడ్యూల్ ని కూడా చాలా రిచ్ గా తెరకెక్కించారు. ఇక ఫస్ట్ రిలీజ్ చేసిన పోస్టర్ తర్వాత ఈ సినిమా మీద చాలా వరకు నెగెటివిటీ అయితే వచ్చింది. ఎందుకంటే ముస్లింలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఈ సినిమాలో ఖురాన్ పేపర్ ని చింపి టీలో ముంచే సన్నివేశాలు ఉంటాయి. తద్వారా ఈ సినిమాని రిలీజ్ చేయకూడదు అంటూ ముస్లింలు సినిమాకు వ్యతిరేకంగా ధర్నాలు చేయడంతో ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది. దాంతో ఈ సినిమాని పక్కన పెట్టాల్సి వచ్చింది. లేకపోతే చిరంజీవి అప్పుడే ‘గ్లోబల్ స్టార్’ (Global Star) గా అవతరించేవాడు.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించిన విషయం మనకు తెలిసిందే. కానీ చిరంజీవి మాత్రం అప్పుడే ఎవరికీ అందనంత ఎత్తులో పాన్ ఇండియా కాదు. పాన్ వరల్డ్ స్టార్ గా అవతరించేవాడు అనేది వాస్తవం…
ఇక ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ‘వినాలని ఉంది’ (Vinalani Undi)అనే ఒక సినిమాని కూడా చేయాల్సిన చిరంజీవి ఇది పాన్ ఇండియా సినిమాగా రావాల్సింది. కానీ మధ్యలో రాంగోపాల్ వర్మ ఈ సినిమాని వదిలేసి బాలీవుడ్ కి వెళ్ళిపోవడం పట్ల చిరంజీవి కొంతవరకు వర్మ మీద తీవ్రమైన కోపంతో అయితే ఉన్నాడు…
ఇక అలాగే సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో భూలోకవీరుడు(Bhuloka veerudu) అనే ఒక సినిమాని కూడా చేయాల్సింది. కానీ ఆ సినిమాని కూడా చేయలేకపోయాడు. మొత్తానికైతే ఈ సినిమాలను చేసి ఉంటే చిరంజీవి అప్పుడే పాన్ ఇండియా, పాన్ వరల్డ్ హీరో అయ్యేవాడు అనేది వాస్తవం…