Aamir Khan : సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హీరో అయినా అమీర్ ఖాన్ (Ameer Khan) సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు…ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. రొటీన్ కి భిన్నంగా సినిమాలను చేయడంలో ఆయన దిట్ట…ఆయనను మించిన నతులు బాలీవుడ్ లో మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి సందర్భంలోనే అమీర్ ఖాన్ సినిమా విషయాలను పక్కనపెట్టి పర్సనల్ విషయానికి వస్తే ఇప్పటికే ఆయన రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరికి విడాకులు ఇచ్చాడు. రీనా దత్తా, కిరణ్ రావు అనే ఇద్దరిని పెళ్లి చేసుకొని వాళ్లకు డివోర్స్ ఇచ్చాడు. ఇప్పుడు మూడో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఆయన బెంగళూరుకు చెందిన ఒక అమ్మాయితో డేటింగ్ లో ఉన్నట్టుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి రీసెంట్ గా తన ఫ్యామిలీకి ఆ అమ్మాయిని పరిచయం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మరి అన్ని కుదిరితే 59 ఏళ్ల వయసులో ఉన్న అమీర్ ఖాన్ మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడనే వార్తలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…
ప్రస్తుతం గత మూడు సంవత్సరాల నుంచి ఆయన ముఖానికి మేకప్ వేసుకోకుండా ఖాళీగానే ఉంటున్నాడు. ఎలాంటి సినిమాలు చేయాలి ఏ సినిమా చేస్తే సూపర్ సక్సెస్ ని సాధిస్తాను అనే ధోరణిలోనే ఆయన ఇంకా ఆలోచనల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకోసమే రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలను కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న పోటీని ఎదురుకోవాలంటే వైవిధ్యభరితమైన కథాంశాలతో సినిమాలు చేయాలని ఒక టార్గెట్ ను తను పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది.
దాని కోసమే కథల ఎంపికలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ‘లాల్ సింగ్ ఛద్దా సినిమా వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికి ఆయన ఇంకా మరొక సినిమా చేయకపోవడం పట్ల అతని అభిమానులు తీవ్రమైన నిరాశకు గురి అవుతున్నారనే చెప్పాలి.
మరి ఇప్పటికైనా తొందరగా మంచి కథను సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తాడా లేదా అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి అమీర్ ఖాన్ మరోసారి ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు తద్వారా ప్రేక్షకులు ఎలా అలరిస్తాడు అనేది…