Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో బిగ్ బాస్ గా పిలుచుకునే మెగాస్టార్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆయన సాధించిన విజయాలు అలాంటివి.ఆ సినిమాలు ఆయన్ని మెగాస్టార్ గా నిలబెట్టడమే కాకుండా ఆయన్ని ప్రేక్షకులకు దగ్గర చేశాయి. ఇక ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. చిరంజీవి గురించి ఇండియా మొత్తం లో తెలియని వారు ఎవరూ లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశక్తి లేదు. ప్రాణం ఖరీదు సినిమా నుంచి మొన్న వచ్చిన భోళా శంకర్ వరుకు ఆయన చేసిన ప్రతి పాత్ర కూడా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకొచ్చి పెట్టాయి.
నిజానికి ఆయన చేసే ప్రతి పాత్రలో 100% ఎఫర్ట్ పెట్టి సినిమాలు చేస్తారు. కాబట్టి ఆయన ఇప్పటికీ టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి ఇప్పటివరకు చాలా రకాల క్యారెక్టర్ లను పోషిస్తూ సినిమాలు చేశారు. కానీ ఆయన ఇప్పటి వరకు ఫుల్ లెంత్ స్పై థ్రిల్లర్ లో ఒక్కసారి కూడా నటించలేదు. కాబట్టి ఇప్పుడు ఆయన స్పై థ్రిల్లర్ సినిమా చేస్తే అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు ఇక ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులందరూ మెగాస్టార్ నుంచి ఒక స్పై సినిమా కావాలంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితుల్లో స్పై థ్రిల్లర్ లాంటి సినిమాలు చేయడం కొంచెం కష్టమే ఎందుకంటే అలాంటి సినిమాలు చేయాలంటే అడ్వెంచర్స్ చేయాల్సి ఉంటుంది.
అభిమానుల కోరిక మేరకు ఆయన ఈ సినిమాని కనక చేసినట్లయితే ఈ క్యారెక్టర్ లో కూడా తను చేసి మెప్పించినవాడు అవుతాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక చిరంజీవి లాంటి స్టార్ హీరో ఆ సినిమా స్టోరీని ఆ క్యారెక్టర్ ని బాగా డీల్ చేసే డైరెక్టర్ దొరికితే ఆయన ఏ పాత్ర అయిన చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు. కానీ దాన్ని సరిగ్గా డీల్ చేసే డైరెక్టర్ దొరక్కపోతే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ చేసిన కూడా ప్రత్యేక గుర్తింపు రాదు. కాబట్టే ఆయన ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఇక స్పై జానర్ లో ఒక మంచి స్క్రిప్ట్ దొరికితే తను ఆ సినిమాలో నటించాలని చూస్తున్నాడు…