Animal: అనిమల్ లో రన్బీర్ ఓకే… కానీ మన తెలుగు హీరోతో చేస్తే ఇంకా డబుల్ ఇంపాక్ట్ ఉండేదేమో..?

కబీర్ సింగ్ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో బాలీవుడ్ లో స్టార్ హీరో అయిన రన్బీర్ కపూర్ ని హీరోగా పెట్టి ఆనిమల్ అనే సినిమా చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా ఎనిమిది రోజుల్లోనే 600 కోట్ల కలెక్షన్ ను రాబట్టి బాలీవుడ్ లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా అవతరించబోతుంది.

Written By: Gopi, Updated On : December 10, 2023 10:47 am

Animal

Follow us on

Animal: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో టైం లో ఒక్కో సినిమాకు సంబంధించిన ట్రెండ్ అనేది నడుస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో మొత్తం సందీప్ రెడ్డి వంగ ట్రెండ్ నడుస్తుంది అనేది మాత్రం వాస్తవం…ఎందుకంటే అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో ఒక స్టార్ డమ్ ని క్రియేట్ చేసుకున్న ఈ డైరెక్టర్…హిందీలో కబీర్ సింగ్ సినిమాతో తనకంటూ ఒక స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు.

కబీర్ సింగ్ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో బాలీవుడ్ లో స్టార్ హీరో అయిన రన్బీర్ కపూర్ ని హీరోగా పెట్టి ఆనిమల్ అనే సినిమా చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా ఎనిమిది రోజుల్లోనే 600 కోట్ల కలెక్షన్ ను రాబట్టి బాలీవుడ్ లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా అవతరించబోతుంది.ఇక ఈ సినిమాను చూసిన చాలామంది రణ్బీర్ కపూర్ యాక్టింగ్ అద్భుతంగా ఉంది. అలాగే సందీప్ రెడ్డి వంగ మేకింగ్ కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది అంటూ చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు…

మరి కొంతమంది మాత్రం సందీప్ రెడ్డి వంగ అనవసరంగా రన్బీర్ కపూర్ లాంటి బాలీవుడ్ హీరోని పెట్టి అనిమల్ సినిమా చేశారు. అలా కాకుండా మన తెలుగు రౌడీ హీరో అయిన విజయ్ దేవరకొండ ను పెట్టీ చేస్తే ఈ సినిమా కూడా మరొక బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచేది. మన తెలుగు హీరో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగేవాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి రన్బీర్ కపూర్ కూడా ఈ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించాడు ఈ సినిమా చూసిన తర్వాత మనం రన్బీర్ కపూర్ యాక్టింగ్ కి వంక పెట్టలేం కానీ బాలీవుడ్ హీరో కంటే మన తెలుగు హీరో అయిన విజయ్ ని పెట్టి చేసిన కూడా విజయ్ కూడా ఆ క్యారెక్టర్ కి అంతే ఇంపాక్ట్ ఇచ్చేవాడు అంటూ సినీ పెద్దలు సైతం ఈ రకం గా ఈ సినిమా మీద వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇక్కడ మరికొందరు మాత్రం రన్బీర్ కపూర్ తో పోల్చుకుంటే విజయ్ దేవరకొండ కి మార్కెట్ అంతగా లేదు. కాబట్టి ఈ సినిమా హిట్ అయితే అయ్యేదేమో కానీ మరి ఇంత భారీ వసూళ్లను రాబట్టేది కాదేమో అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు… ఏదేమైనా అనిమల్ సినిమా రూపంలో బాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ చేసే సినిమా చేసిన మన తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డివంగకి కంగ్రాట్స్ చెప్పాలి…