Homeఎంటర్టైన్మెంట్Icon Star Allu Arjun global fame: బయటపడ్డ అల్లు అర్జున్ గ్లోబల్ ఫేమ్, పడి...

Icon Star Allu Arjun global fame: బయటపడ్డ అల్లు అర్జున్ గ్లోబల్ ఫేమ్, పడి చచ్చారు

Icon Star Allu Arjun global fame: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్లోబల్ ఫేమ్ NATS 2025 వేదికగా బయటపడింది. అమెరికాలో ఆయనకు దక్కిన ఆహ్వానం, తెలుగువారి ప్రేమాదరణలు ప్రత్యేకంగా నిలిచాయి. అల్లు అర్జున్ ని జస్ట్ అథితిగా కాకుండా, తెలుగువారి గొప్పతనంగా ఎన్ఆర్ఐలు భావించారు. వరల్డ్ వైడ్ ఉన్న ప్రతి తెలుగువాడు అల్లు అర్జున్ అంటే అమితమైన అభిమానం కలిగి ఉన్నారని తెలుస్తుంది. యూఎస్ లో అల్లు అర్జున్ క్రేజ్ చూసిన టాలీవుడ్ జనాలకు మైండ్ బ్లాక్ అయ్యింది. అంతగా అల్లు అర్జున్ కోసం వారు పరితపించారు.

తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటుతున్న ఒక ఐకాన్ గా అల్లు అర్జున్ ని చూశారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని టంపా కన్వెన్షన్ సెంటర్ వేదికగా NATS 2025 ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. వారిలో అల్లు అర్జున్ ఒకరు. NATS 2025కి ప్రత్యేక ఆకర్షణగా అల్లు అర్జున్ నిలిచారు. ఆయన ప్రెజెన్స్ నిర్వాహకులతో పాటు ఆడియన్స్ లో జోష్ నింపింది. ఇక వేదిక మీద అల్లు అర్జున్ చెప్పిన ‘రప్పా రప్పా’ డైలాగ్ కి ఆడియన్స్ ఊగిపోయారు. ఆ డైలాగ్ కి ఆడియన్స్ లో గూస్ బంప్స్ ఫీలింగ్స్ కలిగాయి అంటే అతిశయోక్తికాదు.

Also Read: మొండికేస్తున్న ‘హరి హర వీరమల్లు’ నిర్మాత AM రత్నం.. ఇలా అయితే ఈసారి కూడా కష్టమే!

NATS 2025 అల్లు అర్జున్(ALLU ARJUN) కారణంగా మరింత ప్రత్యేకంగా నిలిచింది. విలువలతో కూడిన అల్లు అర్జున్ జర్నీ, తెలుగువారు అమితమైన హీరోగా మార్చాయి. అల్లు అర్జున్ సాటిలేని ఛరిష్మా, క్రేజ్ NATS 2025 వేదికగా రుజువయ్యాయి. పుష్ప, పుష్ప 2 చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు అల్లు అర్జున్. అయితే ఆయన ఇమేజ్ విశ్వవ్యాప్తం అయ్యిందని తెలుస్తుంది. ఇకపై అల్లు అర్జున్ సైతం గ్లోబల్ స్టార్స్ లిస్ట్ లో చేరినట్లే అని పరిశీలకుల అభిప్రాయం.

పుష్ప 2 వరల్డ్ వైడ్ రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో భారీ చిత్రం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ చిత్రీకరణ దశలో ఉంది. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయించారు. భారీ విఎఫ్ఎక్స్ తో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. పలు పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు నటించనున్నారట. మరోవైపు అల్లు అర్జున్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నట్లు దిల్ రాజు ఇటీవల ప్రకటించారు.

Exit mobile version