Best Budget Mobile: మిడిల్ క్లాస్ పీపుల్స్ కోసం Realme బడ్జెట్ మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది. అయితే ఈ కంపెనీకి చెందిన ఫోన్లో తక్కువ ధరలో ఉండడమే కాకుండా ఒక్కోసారి వీటిపై డిస్కౌంట్ కూడా ఇస్తుంది. ఇటీవల వచ్చిన వాలంటైన్స్ డే సందర్భంగా ఈ కంపెనీ కి చెందిన ఓ ఫోన్ పై అద్భుతమైన ఆఫర్ను ప్రకటించింది. Realme కి చెందిన P3 Lite 5G అనే మొబైల్ పై డిస్కౌంట్ వర్తిస్తుంది. దీని పూర్తి వివరాల్లోకి వెళితే..
పండుగలు, ప్రత్యేక పర్వదినాల్లో మొబైల్స్ కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. అయితే వాలంటైన్స్ డే సందర్భంగా Realme కంపెనీ తన లేటెస్ట్ ఫోన్ పై ఆఫర్ను ప్రకటించింది. ఈ కంపెనీకి చెందిన P3 Lite 5G ఫోన్ ప్రస్తుతం రూ.10,749 కి అందుబాటులో ఉంది. అయితే దీనిపై బ్యాంకు డిస్కౌంట్ రూ.538 వర్తించనుంది. దీంతో ఈ మొబైల్ రూ.10,211 కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ ఇప్పటికే ప్రారంభించినా త్వరలోనే ముగిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ మొబైల్ పై డిస్కౌంట్ ప్రకటించినప్పటికీ ఇందులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
Realme P3 Lite 5G అనే మొబైల్ లో 6.61 అంగుళాల HD+ డిస్ప్లే ను కలిగి ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 625 నిట్స్ బ్రైట్నెస్ తో పనిచేసే ఈ డిస్ప్లే వాతావరణం ఎలా ఉన్నా.. అద్భుతమైన డిస్ప్లే కనిపిస్తుంది. దీంతో మూవీస్ చూసేవారికి, గేమింగ్ కోరుకునే వారికి అనుగుణంగా ఉంటుంది. ఈ మొబైల్ లో 6 జి బి రామ్, 128 జీబీ స్టోరీస్ కలిగి ఉండడంతో ఇందులో కావలసిన ఫోటోలు, వీడియోలు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ 15 క్లీన్ వంటి సాఫ్ట్వేర్లు కూడా ఇందులో ఇన్బిల్ట్ గా వస్తాయి. నేటి కాలంలో చాలామంది కెమెరా పని తీరు మెరుగ్గా ఉన్న మొబైల్ ను కొనుగోలు చేస్తున్నారు. అలాంటి వారికోసం ఇది బెస్ట్ స్ట్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చే విధంగా పనిచేస్తుంది. ఈ మొబైల్ లో 32 MP మెయిన్ కెమెరా అమాచారు. ఇది కావాల్సిన ఫోటోగ్రఫీని అందిస్తుంది. అలాగే 8 MP సెల్ఫీ కెమెరా ఉండడంతో వీడియో కాలింగ్ కోసం అనుగుణంగా ఉంటుంది.
ఈ మొబైల్లో 6000 mAh బ్యాటరీ ఉంది. ఇది రోజు వారి వినియోగదారులకు అనుగుణంగా ఉంటుంది. ఈ బ్యాటరీ 45 W ఫాస్టెస్ట్ చార్జింగ్తో సపోర్ట్ చేస్తుంది. బిజీగా ఉండేవారు తొందరగా చార్జింగ్ కావాలని అనుకుంటే ఇది బాగా ఉపయోగపడుతుంది.. తక్కువ ధరలో నాణ్యమైన కెమెరాతోపాటు బ్యాటరీ పర్ఫామెన్స్ ఎక్కువగా ఉండే మొబైల్ కావాలంటే ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు.