https://oktelugu.com/

Actress Hema : నా లైఫ్ నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్తా… బెంగళూరు రేవ్ పార్టీ పై మొదటిసారి నోరు విప్పిన నటి హేమ

యాక్ట్రెస్ హేమ మొదటిసారి బెంగుళూరు రేవ్ పార్టీపై నోరు విప్పారు. పార్టీలో పాల్గొన్నట్లు ఒప్పుకున్నారు. నేను సాంప్రదాయని కాదు. నేను ఎక్కడికైనా వెళతాను. నా లైఫ్ నా ఇష్టం... అంటూ హేమ సంచలన కామెంట్స్ చేశారు. ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : August 20, 2024 / 10:27 AM IST

    Actess Hema

    Follow us on

    Actress Hema : మూడు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో ఉంది హేమ. లేడీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల చిత్రాల్లో నటించింది. టీనేజ్ లోనే పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ తెలుగు అమ్మాయి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. త్రివిక్రమ్ వంటి దర్శకులు హేమకు మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. కాగా ఇటీవల జరిగిన ఓ పరిణామం ఆమె ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది. బెంగుళూరులోని ఓ ఫార్మ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు. ఈ కేసులో ఆమె అరెస్ట్ అయ్యారు. అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు.

    2024 మే 19-20 తేదీల్లో బెంగుళూరు శివారులో గల ఒక ఫార్మ్ హౌస్లో లావిష్ బర్త్ డే పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో వంద మందికి పైగా పాల్గొన్నట్లు సమాచారం. బర్త్ డే పార్టీలో నిషేదిత డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారంతో బెంగుళూరు పోలీసులు దాడి చేశారు. కొకైన్ తో పాటు నిషేదిత ఉత్ప్రేరకాలు గుర్తించిన పోలీసులు 80 మంది వరకు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నటి హేమ కూడా ఉన్నారని కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి.

    ఈ నేపథ్యంలో హేమ ఓ వీడియో బైట్ విడుదల చేసింది. నేను బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. హైదరాబాద్ లోని ఓ ఫార్మ్ హౌస్లో ప్రస్తుతం నేను చిల్ అవుతున్నాను. అవన్నీ నిరాధార కథనాలు… అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది. హేమ మీడియాను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని తర్వాత అర్థమైంది. హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు ఆమెకు నోటీసులు పంపారు.

    విచారణలో పాల్గొన్న హేమకు రక్త పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. హేమను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అనంతరం హేమ కండిషనల్ బెయిల్ పై విడుదలయ్యారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సైతం ఆమెపై చర్యలు తీసుకుంది. హేమ మా సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో హేమ మొదటిసారి మీడియా ముందుకు వచ్చింది. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో హేమ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.

    బెంగుళూరులో జరిగిన పార్టీలో పాల్గొన్నట్లు ఒప్పుకున్న హేమ అది రేవ్ పార్టీ కాదని అన్నారు. బర్త్ డే పార్టీ ఇచ్చిన వ్యక్తి నా బ్రదర్ లాంటి వాడు. శనివారం రోజు నేను పార్టీకి వెళ్ళాను. ఆదివారం ఏం జరిగింది అనేది నాకు తెలియదు. అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటీ? దానికి చట్టపరమైన ఒక వివరణ ఉందా.. అని హేమ ప్రశ్నించింది. నేను ఇంకా బ్లడ్ శాంపిల్స్ కూడా ఇవ్వలేదు. ఓ మీడియా ఛానల్ లో హేమకు పాజిటివ్ అని కథనాలు ప్రసారం చేశారు. నేను తిరిగి ప్రశ్నిస్తే… హేమ హైడ్రామా చేస్తుంది. సాంప్రదాయని అంటూ ఎద్దేవా చేశారు.

    నేను సాంప్రదాయని కాదు. నేను పార్టీకి వెళ్తా, పెళ్ళికి వెళ్తా, చావుకు వెళ్తా, ఎక్కడికైనా వెళ్తా… నా లైఫ్ నా ఇష్టం. అడగడానికి మీరెవరు? మాకు పర్సనల్ లైఫ్స్ ఉండవా?. అన్ని విషయాలు కోర్టులో తేలుతాయి. కోర్టు వ్యవహారాలు కొంచెం ఆలస్యం కాబట్టి… నిదానంగా నిజాలు బయటకు వస్తాయి.. అంటూ హేమ ఫైర్ అయ్యింది.