https://oktelugu.com/

Sandeep Reddy Vanga : అనిమల్ ‘క్రెడిట్ మొత్తం సందీప్ వంగదేనా మరి రణ్బీర్ కపూర్ పరిస్థితి ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో హిట్లు, ఫ్లాప్ లు అనేవి సర్వసాధారణం...అయితే కొంత మంది దర్శకులు చేసిన ప్రతి సినిమాలు సక్సెస్ అవుతూనే ఉంటాయి. ఇక మరికొందరు చేసిన సినిమాలు మాత్రం కల్ట్ క్లాసికల్ గా నిలుస్తాయి. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ సెపరేట్ గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ...

Written By:
  • Gopi
  • , Updated On : August 20, 2024 / 10:35 AM IST

    Sandeep Reddy Vanga

    Follow us on

    Sandeep Reddy Vanga : గత కొన్ని రోజుల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీకి సరైన సక్సెసులు రావడం లేదు. ఎంత పెద్ద స్టార్ హీరో నుంచి సినిమా వచ్చినా కూడా ఆ సినిమాలేవి కూడా సక్సెస్ ను దక్కించుకోవడం లేదు. అందువల్లే బాలీవుడ్ ఇండస్ట్రీ మీద భారీగా దెబ్బ పడుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావులు లీడ్ రోల్ చేసిన ‘స్ట్రీ 2’ సినిమా భారీ విజయాన్ని సాధించి మంచి కలెక్షన్స్ ను రాబట్టడమే కాకుండా సరి కొత్త రికార్డ్ లను సృష్టిస్తు ముందుకు సాగుతుంది.

    గతంలో స్ట్రీ 2 సినిమా వచ్చి సూపర్ సక్సెస్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా మీద పలువురు మేధావులు సైతం వాళ్లభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా కేజీఎఫ్, కేజీఎఫ్ 2, అనిమల్ సినిమాలు క్రియేట్ చేసిన రికార్డులను తిరగరాస్తు ముందుకు దూసుకెళ్తోంది. ఇక రన్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అనిమల్ సినిమా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కినప్పటికి భారీ విజయాన్ని సాధించింది.

    ఇక ఈ సినిమా సాధించిన రికార్డులను ఇప్పుడు స్ట్రీ 2 సినిమా అలవోక గా బ్రేక్ చేస్తున్నట్టు బాలీవుడ్ లో చాలా కథలనైతే వెలువడుతున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఒక పంజాబ్ లో మినహాయిస్తే ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల మంచి యనిమల్ సినిమా రికార్డ్ ను బ్రేక్ చేస్తు వస్తుంది. ఎందుకంటే అనిమల్ సినిమా పంజాబ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. కాబట్టి అక్కడ ఈ సినిమాకి మంచి ఆదరణ అయితే దక్కింది. ఇక దాంతో పాటుగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో అయిన తెలుగు, తమిళంలో మాత్రం ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుంది. అయితే ఇక్కడ మాత్రం సందీప్ రెడ్డి వంగ మేనియా అనేది కొనసాగుతుంది. ఎందుకంటే సౌత్ లో రన్బీర్ కపూర్ ఎవరికి తెలియదు. కాబట్టి ఈ సినిమా సౌత్ లో సందీప్ ను చూసే ప్రేక్షకులు ఈ సినిమాకు వెళ్లారు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

    ఇక అనిమల్ సినిమా సక్సెస్ లో మొత్తం క్రెడిట్ సందీప్ రెడ్డి వంగాకే వెళుతుంది. రణ్బీర్ కపూర్ సినిమాలో ఉన్న పెద్దగా ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఇకమీదట ఆయన చేయబోయే సినిమాలకి కూడా పెద్దగా బజ్ అయితే క్రియేట్ అయ్యే అవకాశాలు లేవు. ఇక ప్రస్తుతానికి ఆయన రామాయణం సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా సౌత్ లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది తెలియాల్సి ఉంది…