https://oktelugu.com/

Akhanda: అఖండ ఉత్సాహంతో బోయపాటితో చిరు కాంబోకు ప్లాన్​?

Akhanda: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించినా “అఖండ” చిత్రం విడుదలైన అప్పటి నుండి బాక్సాఫీస్ వద్ద కనకపు వర్షం కురిపిస్తూనే ఉంది. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి స్పందన అందుకుంది. బోయపాటి శ్రీనివాస్ – బాలయ్య కాంబినేషన్ లో హైట్రిక్ విజయం అందుకోవడంతో నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో బోయపాటి శ్రీను మళ్లీ ఫామ్​లోకి వచ్చినట్లైంది. వినయ విధేయ రామ సినిమాతో డిజాస్టర్ అందుకున్న బోయపాటి.. చాలా గ్యాప్​ తర్వాత భారీ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 7, 2021 / 11:57 AM IST
    Follow us on

    Akhanda: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించినా “అఖండ” చిత్రం విడుదలైన అప్పటి నుండి బాక్సాఫీస్ వద్ద కనకపు వర్షం కురిపిస్తూనే ఉంది. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి స్పందన అందుకుంది. బోయపాటి శ్రీనివాస్ – బాలయ్య కాంబినేషన్ లో హైట్రిక్ విజయం అందుకోవడంతో నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో బోయపాటి శ్రీను మళ్లీ ఫామ్​లోకి వచ్చినట్లైంది. వినయ విధేయ రామ సినిమాతో డిజాస్టర్ అందుకున్న బోయపాటి.. చాలా గ్యాప్​ తర్వాత భారీ విజయాన్ని దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే  తన కసిని మాస్ యాక్షన్​గా మలిచి అఖండలో చూపించాడు. దీంతో స్టార్ హీరోలంతా ప్రస్తుతం బోయపాటివైపు చూడటం మొదలుపెట్టారు.

    ఇప్పటికే బోయపాటి తర్వాత సినిమాలో పలు హీరోలు వరుస లిస్ట్​లో ఉండగా.. ఇప్పుడు ఈ లైన్​లో మెగాస్టార్ చిరంజీవి చేరిపోయారు. రామ్ చరణ్ – బోయపాటి కాంబోలో వచ్చిన వినయ విధేయ రామ స్క్రిప్ట్ చదివినప్పుడే ఆయనలోని మాస్ నాకు నచ్చిందని చిరు ఒకానొక సందర్భంలో చెప్పారు. ఈ క్రమంలోనే ఆయనతో కలిసి సినిమా తీయడానికి తానెప్పుడూ రెడీగా ఉన్నానని ఓపెన్​ స్టేట్​మెంట్​ చెప్పేశారు.

    ఇప్పుడు అఖండ సినిమా బంపర్​ హిట్​ అందుకోవడంతో మెగాస్టార్​ బోయపాటితో సినిమా తీసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కలయికలో సినిమా కానీ కన్​ఫర్మ్​ అయితేే.. ఇక మరో ఊర మాస్ కాంబోకు రంగం సిద్ధమైనట్లే. మెగాస్టార్​ హీరో మేనరిజం.. బోయపాటి మాస్​ యాక్షన్​ కలిస్తే ఇక ఇండస్ట్రీ షేక్​ కాక తప్పదని అభిమానులు అంటున్నారు. మరి ఈ విషయంపై క్లారిటీ తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.