Sandeep Reddy Vanga on Gaayam Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో శివ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ….ఆయన ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీకి వచ్చిన సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం పాన్ ఇండియా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే వీళ్లిద్దరు కలిసి జగపతిబాబు హోస్ట్ గా చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మూరా’ షో కి హాజరయ్యారు. మరి ఈ షో లో జగపతిబాబు వాళ్ళను కొన్ని విచిత్రమైన ప్రశ్నలైతే అడిగాడు. ఒక అందులో సందీప్ రెడ్డి వంగానే ఆర్జీవిని అడిగినట్లు తెలుస్తోంది. మరి వీళ్లిద్దరూ కలిసి చేసిన హంగామాలో జగపతి బాబు సందీప్ రెడ్డి వంగ ను ఉద్దేశించి గాయం సినిమా నువ్వు నా కోసం తీశావా? ఊర్మిళ కోసం చూశావా అని అడగగా ఆ ప్రశ్నకు సందీప్ సమాధానం చెబుతూనే నేను మీ ఎవరి కోసం చూడలేదు… ఆర్జీవి గారి కోసం చూశానని చెప్పాడు. నాకు తనంటే చాలా ఇష్టం మొదటి నుంచి ఆయన సినిమాలను చూడడానికి ఆసక్తి చూపించే వాడినని అందుకే ఆయన కోసమే సినిమాని చూశానని చెప్పాడు.
మరి మొత్తానికైతే ఆర్జీవీ అంటే తనకు చాలా ఇష్టమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను ఎలాగైనా సరే స్టార్ డైరెక్టర్ గా మరోసారి ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన పాన్ ఇండియా సినిమాలను మాత్రమే చేశాడు.
కానీ మొదటిసారి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రేక్షకులందరిని మెప్పించి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని మరి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.
తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవుతోంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…అయితే ఈ షో లో వీళ్ల ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత ఈ షో కి మరింత భారీ క్రేజ్ పెరిగి టీఆర్పీ రేటింగ్ కి కూడా నెక్స్ట్ లెవల్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది…