Poorna: హీరోయిన్ పూర్ణ ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయిందని చెప్పి మైండ్ బ్లాక్ చేశారు. రేపో మాపో పూర్ణ పెళ్ళని అనుకుంటున్న జనాలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొన్ని నెలల క్రితం పూర్ణ పోస్ట్ చేసిన ఫోటో వైరల్ అయ్యింది. సదరు ఫొటోలో పూర్ణ కాబోయే భర్తను పరిచయం చేసింది. షానిద్ అసిఫ్ అలీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. షానిద్ దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త. ఆయనకు ఒక బిజినెస్ గ్రూప్ ఉంది. ప్రకటించిన వెంటనే నిశ్చితార్థం చేసుకున్నారు. పూర్ణ అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్లో నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేశారు.

అనంతరం తన ప్రొఫెషనల్ లో ఆమె బిజీ అయ్యారు. సినిమాలు, టెలివిజన్ షోస్ లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో పూర్ణ వివాహం ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. అయితే పూర్ణకు ఆల్రెడీ వివాహం జరిగిందట.ఈ విషయాన్ని పూర్ణ స్వయంగా ధృవీకరించారు. మే 31న మా నిశ్చితార్థం జరిగింది. జూన్ 12న వివాహం చేసుకున్నాం. అనివార్య కారణాల వలన కొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. పెద్దగా ఎవరికీ ఆహ్వానం పంపలేదని పూర్ణ తెలియజేశారు.
అయితే ఇండియాలో ఉన్న సన్నిహితులు, మిత్రులు, బంధువుల కోసం కేరళలో ఇక రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. పూర్ణ ఇచ్చిన సడన్ షాక్ నుండి ఆమె అభిమానులు ఇంకా తేరుకోలేదు. పూర్ణ లైఫ్ గమనిస్తే ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆమె గతంలో మాదిరే ఉంటున్నారు. ఇటీవల పూర్ణ నటించిన తీస్ మార్ ఖాన్ విడుదలైంది. ఆది హీరోగా తెరకెక్కిన ఆ చిత్రంలో పూర్ణ కీలక రోల్ చేశారు.

అలాగే ఢీ తో పాటు పలు టెలివిజన్ షోస్ లో పూర్ణ పాల్గొంటున్నారు. ఢీ షో జడ్జిగా వచ్చిన పూర్ణ ఒక మేల్ డాన్సర్ కి ముద్దు ఇచ్చింది. అలాగే అతడి బుగ్గ కొరికింది. పెళ్ళికి ముందు ఇవన్నీ ఓకే. ఒకరి జీవిత భాగస్వామి అయ్యాక చేసే సాహసం ఎవరూ చేయరు. కానీ పూర్ణ చేశారు. ఆమె డాన్సర్ బుగ్గ కొరికిన ఎపిసోడ్ ఈ మధ్యనే ప్రసారం అయ్యింది. పూర్ణ పెళ్లి రద్దంటూ కూడా వార్తలు వచ్చాయి. పూర్ణ మాత్రం ఐదు నెలల క్రితమే పెళ్ళైపోయింది చెప్పి థ్రిల్లింగ్ ట్విస్ట్ ఇచ్చింది.