https://oktelugu.com/

Avika Gor: నాకు ఏడు సార్లు పెళ్లి చేశారు… అవికా గోర్ షాకింగ్ కామెంట్స్!

ససురాల్ సీమర్ కా అనే సీరియల్ లో సన్నివేశాలు తనను ఇబ్బంది పెట్టాయని, అవి వాస్తవానికి దూరంగా ఉన్నాయని ఆమె అన్నారు. నాకు మొత్తంగా ఏడు సార్లు పెళ్లి చేశారు. మూడుసార్లు హీరోతో మరో నాలుగు సార్లు ఇతర క్యారెక్టర్స్ తో పెళ్లి చేశారు.

Written By: , Updated On : June 12, 2023 / 08:35 AM IST
Avika Gor

Avika Gor

Follow us on

Avika Gor: బాలికా వధు సీరియల్ తో అవికా గోర్ ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆమెకు విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది. అత్యంత సక్సెస్ఫుల్ సీరియల్ అయిన బాలికా వధు ఇతర భాషల్లో కూడా డబ్ అయ్యింది. తెలుగులో సైతం ప్రసారమైంది. అవికా గోర్ కి ఈ సీరియల్ అనేక ఆఫర్స్ తెచ్చిపెట్టింది. సినిమాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా అవికా గోర్ నటించారు. అలాగే ఆమె పలు సీరియల్స్ చేశారు. కాగా తాను నటించిన ఓ సీరియల్ గురించి ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ససురాల్ సీమర్ కా అనే సీరియల్ లో సన్నివేశాలు తనను ఇబ్బంది పెట్టాయని, అవి వాస్తవానికి దూరంగా ఉన్నాయని ఆమె అన్నారు. నాకు మొత్తంగా ఏడు సార్లు పెళ్లి చేశారు. మూడుసార్లు హీరోతో మరో నాలుగు సార్లు ఇతర క్యారెక్టర్స్ తో పెళ్లి చేశారు. అలాగే మూడుసార్లు నేను చనిపోయి బ్రతికినట్లు చూపించారు. ఆత్మలతో మాట్లాడుతున్నట్లు చూపించారు. ఆ సీన్స్ తలచుకుంటే ఇప్పటికీ నవ్వు వస్తుందని అవికా గోర్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అవికా గోర్ ఉయ్యాలా జంపాలా చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ చిత్రం 2014లో విడుదలై సూపర్ హిట్ కొట్టింది. పల్లెటూరి అమ్మాయి పాత్రలో అవికా గోర్ మెప్పించారు. ఈ చిత్రానికి నాగార్జున నిర్మాత కావడం మరొక విశేషం. అనంతరం తెలుగులో వరుసగా చిత్రాలు చేసింది. నిఖిల్ కి జంటగా నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా మంచి విజయం సాధించింది.

ప్రస్తుతం అవికా తెలుగులో రెండు ఒక హిందీ చిత్రం చేస్తున్నారు. 1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్ మూవీ జూన్ 23న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో అవికా గోర్ పాల్గొంటున్నారు. ఇది హారర్ ఫిల్మ్ కాగా అవికా గోర్ ప్రధాన పాత్ర చేసింది. కొన్నాళ్ల క్రితం అవికా గోర్ మిలింద్ చాంద్వాని అనే వ్యక్తిని ప్రేమికుడిగా పరిచయం చేసింది. దాదాపు రెండేళ్లుగా అతనితో రిలేషన్ లో ఉంది. వీరిద్దరూ తరచుగా ఇష్టమైన ప్రదేశాల్లో విహరిస్తూ ఉంటారు.