https://oktelugu.com/

Naga Chaitanya: కారులో ఓ అమ్మాయికి ముద్దు పెడుతూ దొరికాను.. చైతూ బోల్డ్ కామెంట్లు..!

విడాకులు అనంతరం నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్లకు దగ్గరయ్యాడనే వాదన తెరపైకి వచ్చింది. నాగ చైతన్య కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి శోభితను తరచుగా ఆయన తీసుకెళ్లేవారట.

Written By: , Updated On : November 1, 2023 / 05:53 PM IST
Naga Chaitanya

Naga Chaitanya

Follow us on

Naga Chaitanya: నాగ చైతన్యకు ఇండస్ట్రీలో క్లీన్ ఇమేజ్ ఉంది. ఆయన హీరోయిన్ సమంతను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏళ్ల తరబడి ప్రేమించుకున్న సమంత-నాగ చైతన్య 2018లో వివాహం చేసుకున్నారు. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. నాలుగేళ్లు అన్యోన్యంగా ఉన్నారు. సడన్ గా ఏముందో తెలియదు. విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కొన్నాళ్లుగా దూరంగా జీవించిన సమంత, నాగ చైతన్య… 2021 అక్టోబర్ లో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. పరస్పర అవగాహనతో విడాకులు తీసుకుంటున్నట్లు వివరణ ఇచ్చారు.

విడాకులు అనంతరం నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్లకు దగ్గరయ్యాడనే వాదన తెరపైకి వచ్చింది. నాగ చైతన్య కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి శోభితను తరచుగా ఆయన తీసుకెళ్లేవారట. దీంతో నాగ చైతన్య-శోభిత మధ్య ఎఫైర్ నడుస్తోందన్న పుకార్లు తెరపైకి వచ్చాయి. కాగా కొన్ని ఆధారాలు కూడా దొరకడం కొస మెరుపు.

లండన్ కి జంటగా వెళ్లిన చైతు, శోభిత ఓ ఇండియన్ రెస్టారంట్ లో లంచ్ కి వెళ్లారు. అక్కడి చెఫ్ నాగ చైతన్యను గుర్తించి సెల్ఫీ దిగాడు. ఆ సెల్ఫీలో దూరంగా కూర్చుని ఉన్న శోభిత కూడా కవర్ అయ్యింది. సదరు చెఫ్ ఆ ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. దాంతో నాగ చైతన్య-శోభిత లండన్ లో చక్కర్లు కొడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. అయినప్పటికీ చైతు టీమ్… అవన్నీ అపోహలు అంటూ ఖండిస్తారు.

అయితే గతంలో నాగ చైతన్య ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ కామెంట్ చేశాడు. కారులో ఓ అమ్మాయిని కిస్ చేస్తూ దొరికిపోయినట్లు ఒప్పుకున్నాడు. మరి మన్మధుడు నాగార్జున కొడుకుగా ఆ మాత్రం రొమాంటిక్ గా ఉండిపోతే ఎలా. ఇక చైతూ కెరీర్ పరిశీలిస్తే…ఆయనకు బ్యాడ్ టైం నడుస్తుంది. బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ పడ్డాయి. బంగార్రాజు ఓ మోస్తరు విజయం సాధించింది. థాంక్యూ, కస్టడీ డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం చందూ మొండేటితో ఓ చిత్రం చేస్తున్న చైతూ హిట్ కోసం తపిస్తున్నాడు.