https://oktelugu.com/

సుశాంత్‌తో డేటింగ్ చేశా.. థాయ్‌లాండ్‌ వెళ్లాం: సారా సంచలనం

డ్రగ్స్‌ కేసు ఇప్పటికే బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరినీ పిలిచి ఎన్సీబీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో బాలీవుడ్‌కు, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోయిన్లు కూడా ఉన్నారు. వీరిని ఒక్కో చోట ఒక్కొక్కరిని అంటూ విచారిస్తున్నారు. బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌తోపాటు దీపిక పదుకొణే, శ్రద్ధా కపూర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌ సిమోనీ ఖంబట్టా, దీపిక మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌లను ఎన్‌సీబీ శనివారం ప్రశ్నించింది. మరోవైపు.. కరణ్‌ జోహార్‌ సంస్థ ధర్మాటిక్‌ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 28, 2020 / 09:33 AM IST

    sushanth sara

    Follow us on

    డ్రగ్స్‌ కేసు ఇప్పటికే బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరినీ పిలిచి ఎన్సీబీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో బాలీవుడ్‌కు, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోయిన్లు కూడా ఉన్నారు. వీరిని ఒక్కో చోట ఒక్కొక్కరిని అంటూ విచారిస్తున్నారు.

    బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌తోపాటు దీపిక పదుకొణే, శ్రద్ధా కపూర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌ సిమోనీ ఖంబట్టా, దీపిక మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌లను ఎన్‌సీబీ శనివారం ప్రశ్నించింది. మరోవైపు.. కరణ్‌ జోహార్‌ సంస్థ ధర్మాటిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పని చేసిన క్షితిజ్‌ రవి ప్రసాద్‌కు ముంబై కోర్టు వచ్చే నెల 3 వరకూ రిమాండ్‌ విధించింది.

    నటి సారా అలీఖాన్‌ శనివారం ఎన్సీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కాగా.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సుశాంత్‌తో తానూ కొంతకాలం ప్రేమలో ఉన్న మాట వాస్తవమేనని, థాయ్‌లాండ్‌కు పర్యటనలో ఆయనతో కలిసి వెళ్లానని ఆమె వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. తాను సిగరెట్స్‌ తాగేదాన్ని తప్పితే డ్రగ్స్‌ ఎప్పుడూ తీసుకోలేదని ఆమె తెలిపారని ఎన్‌సీబీ వర్గాలు తెలిపాయి. సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకునేవాడని ఆమె చెప్పడం గమనార్హం.

    ఇప్పటివరకు రియానే సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ అని అనుకోగా.. ఇప్పుడు సారా అలీఖాన్‌ కూడా సుశాంత్‌తో ప్రేమలో ఉన్నట్లు చెప్పడం గమనార్హం. ఏది ఏమైనా సుశాంత్‌ మృతి ఓ సినిమా థ్రిల్లర్‌‌ను తలపిస్తోందనడంలో అతిశయోక్తి లేదు. మృతి కేసు విచారిస్తున్న సందర్భంలో ఈ భారీ డ్రగ్స్‌ వ్యవహారం వెలుగులోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.