https://oktelugu.com/

Surekha Vani: బాగా డబ్బులున్న బాయ్ ఫ్రెండ్ కావాలి… మనసులో కోరిక పచ్చిగా బయటపెట్టిన సురేఖా వాణి

Surekha Vani: నటి సురేఖావాణి తరచుగా వార్తలకు ఎక్కుతూ ఉంటారు. సోషల్ మీడియా పోస్ట్స్ తో కాక పుట్టించే ఈ నటి రెండో పెళ్లి చేసుకోనున్నారని కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఓ రెండేళ్ల క్రితం సురేఖా వాణి భర్త అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుండి ఆమె ఒంటరిగా ఉంటున్నారు. సురేఖా కూతురు సుప్రీత చాలా క్లోజ్ గా ఉంటారు. విందులు, విహారాలు కలిసి చేస్తారు. ఇటీవల సుప్రీత బర్త్ డే వేడుకలు సురేఖ గ్రాండ్ గా […]

Written By:
  • Shiva
  • , Updated On : August 24, 2022 / 08:57 AM IST
    Follow us on

    Surekha Vani: నటి సురేఖావాణి తరచుగా వార్తలకు ఎక్కుతూ ఉంటారు. సోషల్ మీడియా పోస్ట్స్ తో కాక పుట్టించే ఈ నటి రెండో పెళ్లి చేసుకోనున్నారని కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఓ రెండేళ్ల క్రితం సురేఖా వాణి భర్త అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుండి ఆమె ఒంటరిగా ఉంటున్నారు. సురేఖా కూతురు సుప్రీత చాలా క్లోజ్ గా ఉంటారు. విందులు, విహారాలు కలిసి చేస్తారు. ఇటీవల సుప్రీత బర్త్ డే వేడుకలు సురేఖ గ్రాండ్ గా నిర్వహించింది. ఆ బర్త్ డే పార్టీలో కూతురుకు స్వయంగా షాంపైన్ తాగించి సురేఖ వాణి సంచలనానికి తెరలేపింది.

    Surekha Vani

    ఇక సురేఖా వాణి రెండో వివాహం చేసుకోనున్నారని వరుస కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేఖ వాణి మనసులో కోరిక బయటపెట్టారు. మీరు రెండో పెళ్లి చేసుకుంటున్నారట కదా అని అడుగగా… నాకు రెండో వివాహంపై పెద్దగా ఆసక్తి లేదు. అయితే మా అమ్మాయి సుప్రీత చేసుకోవమని అంటుంది. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు. భవిష్యత్ లో చేసుకోవచ్చు.

    Also Read: Ileana: డబ్బుల కోసం అది కూడా ఒప్పుకున్న ఇలియానా.. ఒకపక్క ప్రియుడు మరోపక్క ఇది.. తగ్గేదే లే అంటున్న ఇల్లీ బేబీ !

    భర్త కాకపోయినా బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుటుందనిపిస్తుంది. మంచి హైట్ పర్సనాలి ఉన్న బాయ్ ఫ్రెండ్ కావాలి. అతనికి లైట్ గా గడ్డం ఉండాలి. బాగా డబ్బులు ఉండాలి. ముఖ్యంగా నన్ను అర్థం చేసుకొని బాగా చూసుకోవాలి. ఈ లక్షణాలు ఉన్నవాడు దొరికితే పెళ్లి కూడా చేసుకోవచ్చు.. అంటూ సురేఖా వాణి మనసులో కోరిక బయటపెట్టారు. బోల్డ్ గా ఆమె చెప్పిన ఈ సమాధానం వైరల్ గా మారింది. గతంలో సురేఖా వాణి రెండో వివాహాం చేసుకుంటున్నారని వార్తలు రాగా కూతురు సుప్రీత ఖండించారు. ఆమె ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఇప్పుడు రెండో పెళ్లి ఆలోచన ఉందంటూ సురేఖ స్వయంగా చెప్పడం విశేషంగా మారింది.

    Surekha Vani

    మరోవైపు సుప్రీతను హీరోయిన్ చేయాలనే ఆలోచనలో సురేఖ ఉన్నారు. ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అందంలో అమ్మకు సుప్రీత ఏమాత్రం తక్కువ కాదు. హీరోయిన్ గా ఆమె సక్సెస్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. కూతురు సుప్రీత పై సురేఖ చాలా ఆశలే పెట్టుకున్నారు. కాగా ఒకప్పుడు విరివిగా సినిమాలు చేసే సురేఖ వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. భర్త మరణం తర్వాత ఆమె సినిమాలు బాగా తగ్గించేశారు. ఈ మధ్య కాలంలో ఆమె నటించిన ఒక్క సినిమా విడుదల కాలేదు.

    Also Read: Vijay Devarakonda: లైగర్’ ఫ్లాప్ అయితే పరిస్థితేంటన్న ప్రశ్నకు విజయ్ దేవరకొండ అదిరిపోయే సమాధానం

     

     

    Tags