https://oktelugu.com/

Ileana: డబ్బుల కోసం అది కూడా ఒప్పుకున్న ఇలియానా.. ఒకపక్క ప్రియుడు మరోపక్క ఇది.. తగ్గేదే లే అంటున్న ఇల్లీ బేబీ !

Ileana: గోవా బ్యూటీ హీరోయిన్ ఇలియానాకి ఇంకా ఆశ తగ్గలేదు. తనతో పాటు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు ఎప్పుడో పేడ్ అవుట్ అయిపోయి.. పెళ్లి కూడా చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయారు. కానీ, ఇలియానా మాత్రం ఇంకా అవకాశాల కోసం అర్రులు చాస్తూనే ఉంది. ‘ఈ ముదురు హీరోయిన్ మాకొద్దు మహాప్రభో’ అంటూ బాలీవుడ్ యంగ్ హీరోలు మొత్తుకుంటున్నా… ఇలియానా మాత్రం తన ప్రయత్నాలు తాను చేసుకుంటూనే ఉంది. తనకున్న పరిచయాలతో ఇలియానా […]

Written By:
  • Shiva
  • , Updated On : August 24, 2022 / 08:50 AM IST
    Follow us on

    Ileana: గోవా బ్యూటీ హీరోయిన్ ఇలియానాకి ఇంకా ఆశ తగ్గలేదు. తనతో పాటు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు ఎప్పుడో పేడ్ అవుట్ అయిపోయి.. పెళ్లి కూడా చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయారు. కానీ, ఇలియానా మాత్రం ఇంకా అవకాశాల కోసం అర్రులు చాస్తూనే ఉంది. ‘ఈ ముదురు హీరోయిన్ మాకొద్దు మహాప్రభో’ అంటూ బాలీవుడ్ యంగ్ హీరోలు మొత్తుకుంటున్నా… ఇలియానా మాత్రం తన ప్రయత్నాలు తాను చేసుకుంటూనే ఉంది. తనకున్న పరిచయాలతో ఇలియానా నేటికీ అరకొర హిందీ అవకాశాలను అంది పుచ్చుకుంటూనే ఉంది.

    Ileana

    ఒకపక్క తన జూనియర్ హీరోయిన్లు కూడా పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కూడా కంటున్నారు. కానీ ఇలియానా మాత్రం ఇంకా రెమ్యునరేషన్ లెక్కలే చూసుకుంటూ టైం పాస్ చేస్తుంది. పైగా ఇలియానా సినిమాలు తగ్గాక తనకున్న అభిరుచులను కూడా మార్చుకుంది. నిజానికి ఇలియానాకి హారర్ జానర్ సినిమాలు చేయడం ఇష్టం లేదు. గతంలో కూడా ఓ సినిమా చేసి.. ఇక అలాంటివి చేయను అని చాలా సార్లు చెప్పింది. ఆ మధ్య ఓ హారర్ హిందీ సినిమా విషయంలో ఇలియానాకి ఎదురైన అనుభవాల రీత్యా ఈ మాజీ హీరోయిన్ ఈ నిర్ణయం తీసుకుంది.

    Also Read: Vijay Devarakonda: లైగర్’ ఫ్లాప్ అయితే పరిస్థితేంటన్న ప్రశ్నకు విజయ్ దేవరకొండ అదిరిపోయే సమాధానం

    కానీ, ఇప్పుడు అవకాశాలు లేవు కదా. అందుకే.. తన మనసు మార్చుకుంది ఇలియానా. డబ్బులు వస్తున్నాయి కదా అని, హారర్ చిత్రాలు కూడా ఒప్పుకుంటుంది. ఫేడ్ అవుట్ దశలో ఉన్న హీరోయిన్ కి ఎక్కువ ఆప్షన్స్ ఉండవు. అందుకే.. వచ్చిన ఛాన్స్ లను క్యాష్ చేసుకోవాలని ఇలియానా ఆరాట పడుతుంది. ఇలియానా చేతిలో పెద్ద సినిమాలు ఏమీ లేవు. అందుకే, ఇప్పుడు చిన్నాచితకా చిత్రాల పై పడింది.

    Ileana

    తాజాగా ఇలియానా ఒక హారర్ సినిమా ఒప్పుకుంది. భార్గవ్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఇలియానా ఈ సినిమా చేయబోతుంది. ఐతే, హారర్ సినిమాలు మీకు ఇష్టం లేదు కదా ? అంటే.., ‘నటిగా అన్ని రకాల కథలు, పాత్రలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టే.. హారర్ జానర్ లో కూడా సినిమాలు చేస్తున్నానని ఇలియానా చెప్పుకొచ్చింది. మరి ఇలియానా ఈ సినిమాలతోనైనా మళ్లీ ఫామ్ లోకి వస్తోందేమో చూడాలి.

    ప్రస్తుతానికి అయితే ఈ గోవా బ్యూటీ కత్రీనా కైఫ్‌ సోదరుడు ‘సెబాస్టియన్‌ లారెంట్‌ మిచెల్‌’తో ఇలియానా లవ్‌ ట్రాక్‌ నడుపుతుందట. ఈ ఏడాది కత్రీనా తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కోసం భర్త విక్కీ కౌశల్, బ్రదర్‌ సెబాస్టియన్‌, ఇతర ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి మాల్దీవులకు వెళ్లింది. ఐతే, ఈ వేడుకల్లో ఇలియానా కూడా కనిపించడంతో ఆ మధ్య ఈ వార్త వైరల్ అయ్యింది కూడా. పైగా సెబాస్టియన్‌తో కలిసి ఇలియానా ఇంకా సందడి చేస్తూనే ఉందట.

    Also Read: Ram Charan- Deepika Padukone: చరణ్ కి ఆ హీరోయిన్ అంటే పిచ్చి.. చెర్రీ షాకింగ్ కామెంట్స్.. షాక్ లో ఫ్యాన్స్ !

     

     

    Tags