Chiranjeevi : సంక్రాంతి పండుగ వచ్చేసింది.. మన టాలీవుడ్ హీరోలు కూడా క్రేజీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యారు.. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో.. నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో వస్తున్నారు..’వీర సింహా రెడ్డి’ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవుతుండగా, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల కాబోతోంది.. సుమారుగా ఐదేళ్ల తర్వాత చిరంజీవి మరియు బాలకృష్ణ సంక్రాంతి బరిలో ఒక్కరోజు తేడా తో పోటీపడుతున్నారు.

వీళ్ళిద్దరిలో ఎవరు గెలవబోతున్నారు అనేది మరి కొద్ది గంటల్లో తెలియనుంది.. ఇప్పటి వరకు ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్స్ అదిరిపోయాయి.. ఇక ‘వాల్తేరు వీరయ్య’ కి సంబంధించి చిరంజీవి పలు ఇంటర్వ్యూస్ ఇచ్చాడు.. ఈ ఇంటర్వ్యూస్ లో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.. ముఖ్యంగా వీరసింహా రెడ్డి తో క్లాష్ గురించి చిరంజీవి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.
ఇక అసలు విషయానికి వస్తే.. ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది అనే విషయం తెలిసిందే.. ఇన్నేళ్ళ తెలుగు చలన చిత్ర పరిశ్రమ చరిత్రలో ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి రెండు సినిమాలు రావడం ఎప్పుడూ జరగలేదు.. మొట్టమొదటిసారి జరుగుతుంది.. దీని గురించి చిరంజీవి మాట్లాడుతూ ‘నాకు కూడా క్లాష్ రావాలని ఇష్టం లేదు..రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదల అయితే రెండు సినిమాలకు సమానంగా నష్టం చేకూరుతుంది..కానీ నిర్మాతలకు సంక్రాంతి సీజన్ ముఖ్యం కదా..మా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఇలా ‘వీర సింహా రెడ్డి’ సినిమాని విడుదల చేసుకుంటున్నారు.. మన చిత్రాన్ని వాయిదా వేద్దామా అంటే నేను ఒప్పుకునేవాడిని..వాళ్లకి ఫిబ్రవరి నెలలో వేద్దాం అని చెప్పేవాడిని..కానీ మైత్రి మూవీ మేకర్స్ నన్ను సంప్రదించలేదు.. వాళ్లకి ఎలాంటి సమస్య లేదు అన్నప్పుడు ఎందుకులే అని నేను కూడా పట్టించుకోలేదు’ అంటూ చిరంజీవి ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు.