Hero Venu comments On Boyapati Srinu: స్వయంవరం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటుడు వేణు. తనదైన శైలిలో నటిస్తూ ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించాడు. తను చేసే పాత్రకు న్యాయం చేయడమే అతడి లక్ష్యం. అందుకే తీసిన అన్ని సినిమాలు కూడా కనీసం యావరేజ్ గా ఉండేందుకు ఎంతో కష్టపడతాడు. అలాంటి వేణు కొద్ది కాలంగా గ్యాప్ ఇచ్చాడు. ఎన్డీఆర్ హీరోగా దమ్ము సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి దాదాపు తొమ్మిదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీలో ఓ పాత్రలో మెరిసి మురిపించాడు.

రామారావు ఆన్ డ్యూటీ ప్రమోషన్స్ లో కూడా పాల్గొని చిత్ర ప్రచారంలో పాలుపంచుకున్నాడు. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీనుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దమ్ము సినిమాలో షోలేలో అమితాబ్ లాంటి పాత్ర ఇస్తానని చెప్పినా తన పాత్రకు ఏ మాత్రం గుర్తింపు రాలేదని వాపోయాడు. షోలేలో అమితాబ్ పాత్రను చంపేసినట్లే దమ్ములో కూడా తన పాత్రను చంపేయడంపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఏదో తనకు ఎనర్జిటిక్ పాత్ర ఇస్తాడనుకుంటే ఎటు కాని పాత్ర ఇవ్వడంతో తనకు గుర్తింపు రాలేదని ఆందోళన వ్యక్తం చేశాడు.
ఇక అప్పుడే నటనకు స్వస్తి చెప్పి వ్యాపారాలు చూసుకునే నిమిత్తం వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ వెబ్ సిరీస్ చూసి మళ్లీ సినిమాలు చేయాలనే ఆసక్తితో వచ్చి రామారావు ఆన్ డ్యూటీలో పాత్ర చేశాడు. ఇకపై కూడా సినిమాల్లో నటిస్తానని చెబుతున్నాడు. వ్యాపార లావాదేవీలు సెట్ చేసి రావడంతో కాస్త ఆలస్యమైందని ఇకపై సినిమాల్లో వరుసగా నటిస్తానని తన మనసులో మాట వెల్లడించాడు. మొత్తానికి వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఇకపై రాబోయే సినిమాల్లో అతడిని చూడొచ్చని అభిమానులు ఆశపడుతున్నారు.
రామారావు ఆన్ డ్యూటీలో రవితేజతో కలిసి చేయడంతో తనకు మంచి ఊపున్న పాత్ర దొరికిందని చెబుతున్నాడు. వైవిధ్యమైన పాత్రలెన్నో చేసి ప్రేక్షకులను మెప్పించిన వేణు మరోమారు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవతారమెత్తుతున్నాడు. హీరో అవకాశాలు సన్నగిల్లడంతోనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వేణు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనా మంచి అవకాశాలు అందిపుచ్చుకుని అభిమానులను అలరించాలని కోరుతున్నారు.