Homeఆంధ్రప్రదేశ్‌AP Academic Calendar 2026: పరీక్షలు, సెలవులు.. ఏపీ అకడమిక్ క్యాలెండర్!

AP Academic Calendar 2026: పరీక్షలు, సెలవులు.. ఏపీ అకడమిక్ క్యాలెండర్!

AP Academic Calendar 2026: ఏపీ విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కావడంతో పని దినాలు, పరీక్షలు, సెలవులకు సంబంధించి షెడ్యూల్ ను ప్రకటించింది. ఇదివరకే ప్రకటించిన ఇప్పుడు కొత్తగా పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ తో పూర్తి వివరాలను వెల్లడించింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 రోజులు పాఠశాలలు పనిచేయనున్నాయి. 87 సెలవులు ఉంటాయని క్యాలెండర్ లో స్పష్టం చేశారు. ప్రతి శనివారం 6 నుంచి తొమ్మిది తరగతులకు నో బ్యాగ్ డే అమలు చేయనున్నారు. ఈ లెక్కన ఈ విద్యా సంవత్సరంలో 28 నో బ్యాగ్ లు ఉంటాయని అక్కడ మీకు క్యాలెండర్లో స్పష్టం చేశారు. అయితే ఈ రోజుల్లో కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇండోర్ గేమ్స్, విలువల విద్య, వృత్తి విద్య, పాఠశాల స్థాయిలో హిందీ దివస్ పోటీలు, గణిత పజిల్స్, క్విజ్ తదితర పోటీలు నిర్వహించనున్నారు.
– ఇక వార్షిక సెలవులకు సంబంధించి మొత్తం 87 దినాలు. అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా సెలవులు, జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు, మైనారిటీ పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు అదనంగా ఇస్తారు.
– పరీక్షలకు సంబంధించి ఆగస్టు 3 నుంచి 7 వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, అక్టోబర్ ఐదు నుంచి 8 వరకు ఎఫ్ఏ 2, నవంబర్ 9 నుంచి 20 వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ వన్, జనవరి నాలుగు నుంచి ఏడు వరకు ఎఫ్ఏ 3, ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు ఎఫ్ఏ 4, ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు ఉంటాయి. పదో తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు ఫ్రీ ఫైనల్ పరీక్షలు ఉండనున్నాయి. మార్చి 15 నుంచి 31 వరకు పబ్లిక్ పరీక్షలు జరుగుతాయి.
– జూలై 10, డిసెంబర్ 5న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ నిర్వహిస్తారు. గత ఏడాది తరహాలోనే రాజ్యాంగ దినోత్సవం రోజున మాక్ పార్లమెంట్ నిర్వహిస్తారు. తొమ్మిది నుంచి పదో తరగతికి వచ్చిన విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది.. వేసవి సెలవులకు ముందు ఈ కోర్సు బోధిస్తారు.
– మార్చి 15 నుంచి పాఠశాలలకు ఒంటిపూట బడులు ఉంటాయి. ఏప్రిల్ 24 నుంచి యధావిధిగా వేసవి సెలవులు కొనసాగనున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version