ఎట్టకేలకు టిడిపి ఎమ్మెల్యే… ఆంధ్రప్రదేశ్ మాజీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పైన విడుదలయ్యాడు. ఈఎస్ఐ స్కాం లో అతనిదే ప్రధాన పాత్ర అంటూ ఏసీబీ అధికారులు ఎంతో నాటకీయంగా చేపట్టిన అరెస్టు తర్వాత 70 రోజులు రిమాండ్ లో ఉండి ఇన్వెస్టిగేషన్ కు సహకరించిన అచ్చెన్నాడుని చివరికి కోర్టు వారు కండిషన్ బెయిల్ పై విడుదల చేశారు.
ఇప్పటికే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి దారుణ ఓటమితో కుమిపిపోయి ఉన్న టీడీపికి 23 మంది ఎమ్మెల్యేలలో కేవలం 20 మందే ఇప్పుడు పార్టీకి చెందినవారు. వారిలో ఇద్దరు ముగ్గురు అరెస్టులు, కేసులు, బెయిల్ లు అంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి సమయంలో బయటకు వచ్చి రాగానే తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించి అచ్చెన్నాయుడు పరిస్థితులు తారుమారు చేస్తాడని అందరూ భావించారు. అయితే తన వ్యవహార శైలికి భిన్నంగా అచ్చెన్నాయుడు సైలెంట్ గా ఉండాలని డిసైడ్ కావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
అచ్చెన్నాయుడు టిడిపి ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేసినప్పుడు ఫలానా అవినీతి కుంభకోణంలో భాగస్వామి అయ్యారని ఏసిబి వారు అరెస్టు చేశారు. రెండు నెలలు జైలులో ఉన్నా కూడా అతనికి వ్యతిరేకంగా ఆధారాలను పొందుపరచలేకపోయారు. అయితే ఇలాగే బయటికి వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం వచ్చీ రాగానే రెచ్చిపోయాడు. ఇంకా చెప్పాలంటే ప్రభాకర్ రెడ్డి ఖచ్చితమైన ఆధారాలతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు కానీ అచ్చెన్నాయుడు సంగతి వేరే. ఆది నుండి అంతం వరకు ఇది మొత్తం కుట్రపూరితమైన అరెస్ట్ అని అందరూ ఆరోపిస్తున్న వాళ్లే.
కానీ ఇప్పుడు అచెన్నాయుడు బయటకు వచ్చి ఇలా సైలెంట్ కావడం వెనుక ఎవరైతే అతనిని అరెస్టు చేయించారో వారి వ్యూహం బాగానే పని చేసిందని తెలుస్తోంది. అచ్చెన్నాయుడిని జైలుకు పంపించడం కన్నా తమ నిర్ణయాలకు అతను అడ్డు చెప్పకపోతే చాలు అన్నదే అవతలి వారి వ్యూహం. అంతేకాకుండా ఉత్తరాంధ్ర కీలక నేతలలో ఒకడైన అచ్చెన్నాయుడు సైలెంట్ గా ఉంటే మూడు రాజధానుల వ్యవహారం చాలా త్వరగా అయిపోతుందని వారి ఆశ. ఇదే క్రమంలో వారు దాదాపుగా సక్సెస్ సాధించారు కూడా. మొత్తానికి రెండు నెలలు జైలు అచ్చం నాయుడు ని బాగానే ఇబ్బంది పెట్టింది. త్వరలోనే అతడు చంద్రబాబును కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు అని టిడిపి వర్గాలు ఆశావహంగా ఉన్నాయి.