Bandi Sanjay Padayatra: తెలంగాణ సర్కార్ ఎన్ని అడ్డంకులు కల్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదం ఆగడం లేదు. హైకోర్టుకెక్కి మరీ అనుమతులు తెచ్చుకొని ముందుకు సాగుతోంది. ముస్లిం ప్రాబల్య వివాదాస్పద భైంసా ప్రాంతంలో పాదయాత్రకు కేసీఆర్ సర్కార్ నో చెప్పినా కోర్టు అనుమతితో సాగడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ క్రమంలోనే నిర్మల్ జిల్లాకు చేరిన బండి సంజయ్ అక్కడి ప్రసిద్ధ ఆడెల్లి పోచమ్మ టెంపుల్ లో పూజలు చేసి మరీ పాదయాత్రను ప్రారంభించాడు. ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశాడు.

ఇప్పటివరకు నాలుగు విడతలుగా పాదయాత్ర చేసి, ఈరోజు అడెల్లి పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని, 5వ విడత పాదయాత్రను ప్రారంభించానని బండి సంజయ్ తెలిపారు. ‘‘తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి.కెసిఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ప్రజల కష్టాలను గాలికి వదిలేసి, ఫామ్ హౌస్ కే కేసీఆర్ పరిమితమయ్యాడు. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు, ప్రజలకు భరోసా కల్పించేందుకే మా పాదయాత్ర . తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉచిత విద్య, వైద్యం హామీని నెరవేరుస్తాం.ఇల్లు లేని నిరుపేదలకు ఇంటిని నిర్మించి ఇస్తాం. తెలంగాణలో ఫసల్ బీమా యోజన పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి తీరుతాం’ అని బండి భరోసా కల్పించారు.
పేదల కోసమే మా ఈ ప్రజా సంగ్రామ యాత. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. మా పాదయాత్రతో కేసీఆర్ కు వెన్నులో వణుకు స్టార్ట్ అయింది. కుట్రలో భాగంగానే ఇవాళ మా పాదయాత్రను కేసీఆర్ డైరెక్షన్ లో పోలీసులు అడ్డుకున్నారని బండి సంజయ్ తెలిపారు. సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాలతోనే నన్ను అడ్డుకుంటున్నట్టు పోలీసులు చెప్తున్నారు. భైంసాను సెన్సిటివ్ ప్లేస్ గా మార్చింది ఎవరో కేసీఆర్ సమాధానం చెప్పాలి. కుంటి సాకులు చెప్పి, పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తే… గౌరవ హైకోర్టులో పిటిషన్ వేసి, అనుమతి పొందాం. కోర్టు ఉత్తర్వులకు లోబడి మా పాదయాత్ర, బహిరంగ సభను నిర్వహిస్తాం. ఇవాళ మా పాదయాత్రను చెప్పిన టైమ్ ప్రకారం స్టార్ట్ చేసిన. అడెల్లి పోచమ్మ అమ్మవారి పాదాల చెంత 5వ విడత పాదయాత్ర ప్రారంభించాం’ అని తెలిపారు.

ముఖ్యమంత్రి తిరగడు… ఫార్మ్ హౌజ్ లోనే పంటడు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు. గౌరవ హైకోర్టు నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని బండి సంజయ్ తెలిపారు.
-సామాన్య కార్యకర్త ఇంటికి బండి సంజయ్”
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని అడెల్లి గ్రామంలో సామాన్య కార్యకర్త శేఖర్ గౌడ్ ఇంటికి వెళ్లి, ఆ కార్యకర్త యొక్క యోగక్షేమాలు అడిగి బండి సంజయ్ తెలుసుకున్నారు. శేఖర్ గౌడ్ తో కలిసి ఆ ఇంట్లో చాయ్ తాగారు. పార్టీ పరిస్థితి సహా పలు అంశాలపై చర్చించిన బండి సంజయ్. బండి సంజయ్ వెంట శేఖర్ గౌడ్ ఇంటికి వెళ్లిన పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల అధ్యక్షులు పాయల్ శంకర్, రమాదేవి, పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున రెడ్డి, అప్పాల గణేష్, భూమయ్య, రావుల రామనాథ్, అప్పాల గణేష్, తదితరులు పాల్గొన్నారు.
-ప్రజా సంగ్రామ యాత్ర-5 రేపటి (29.11.2022) షెడ్యూల్
రేపు మధ్యాహ్నం బైంసా పట్టణ శివారులోని గణేష్ ఇండస్ట్రీ సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. రేపటి బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తోపాటు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. బహిరంగ సభ అనంతరం పాదయాత్ర మొదలవుతుంది. రేపు మొత్తం 5.8 కి.మీల మేర పాదయాత్ర చేస్తారు. రేపు రాత్రి బైంసా శివారులో బస చేస్తారు.