Maa Elections 2021 Results: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫైట్ దాదాపు క్లైమాక్స్‌కు చేరింది. క్షణ క్షణం ఉత్కంఠంగా సాగుతోన్న కౌంటింగ్‌తో అందరిలోనూ నరాలు తెగె టెన్షన్ మొదలైంది.

Attari Gururaj with Manchu Mohan Babu
ఇంతటి ఉత్కంఠ ఎన్నికలల్లో విజయం మంచు విష్ణు నే వరిస్తుంది అని తాను ముందే జోస్యం చెప్పాను అని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ వైస్ చైర్మన్,నటుడు,నిర్మాత మరియు ప్రముఖ వ్యాపారవేత్త అత్తరి గురురాజ్ అన్నారు.తమ ఛాంబర్ లోని మా సభ్యులు అందరిని మంచు విష్ణు కె మద్దతు ఇవ్వవలసింది గా కోరానని తెలిపారు.ఇంతటి ఘన విజయాన్ని పొందినందుకు గాను మంచు విష్ణు కి శుభాకాంక్షలు తెలిపారు.
Telangana Film Chamber Vice Chairman Attari Gururaj with Manchu Vishnu
ఇప్పటికే మంచు విష్ణు ప్యానల్‌లో ఎనిమిది మంది విజయం సాధించారు. మాణిక్, హరినాథ్, బొప్పన విష్ణు, పసునూరి శ్రీనివాస్, శ్రీలక్ష్మి, జయవాణి, శశాంక్, పూజిత కార్యవర్గసభ్యులుగా గెలుపొందారు. అంతేగాకుండా.. ఇప్పటివరకూ ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లో నలుగురు గెలుపొందారు. అనసూయ, సురేశ్ కొండేటి, కౌశిక్, శివారెడ్డిలు కార్యవర్గ సభ్యులుగా గెలుపొందారు. విష్ణు ప్యానెల్లోన్ లోని బాబు మోహన్ పై ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుడు శ్రీకాంత్ గెలుపొందారు,
అయితే మా అధ్యక్షుడిగా ‘ప్రకాష్ రాజ్’ పై భారి మెజార్టీ తో ‘మంచు విష్ణు’ గెలుపొందారు.