Posani Krishna Murali (8)
Posani Krishna Murali: నటుడు పోసాని కృష్ణ మురళి ( Posani Krishna Murali) పై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. ఆయన రిమాండ్ కొనసాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న అన్ని కేసుల్లో ఆయనకు విముక్తి లభించింది. న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఇంతలో సిఐడి పీటి వారెంట్ ఇచ్చింది. దీంతో మళ్లీ పోసాని కృష్ణ మురళికి రిమాండ్ తప్పలేదు. అయితే తాజాగా పోసాని కృష్ణ మురళితో సిఐడి పోలీసులు ఫోటోలు దిగేందుకు పోటీ పడడం విమర్శలకు తావిచ్చింది. విచారణ అనంతరం గుంటూరు జిల్లా జైలుకు కృష్ణమురలిని తరలించారు సిఐడి పోలీసులు. ఈ తరలింపు ప్రక్రియలో భాగంగా ఓ సిఐడి పోలీస్ పోసానితో కలిసి జైలు ప్రధాన ద్వారం వద్ద ఫోటో దిగడం వివాదాస్పదంగా మారింది.
* ఫోటో దిగడం పై విమర్శలు
ఓ రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తితో విధుల్లో ఉన్న పోలీస్ ఫోటో దిగడం అనుచితమని పలువురు ప్రశ్నిస్తున్నారు. కస్టడీ విచారణ పూర్తయిన తర్వాత పోసానిని జిల్లా జైలుకు తరలించే ముందు జరిగిన ఈ సంఘటనపై వివిధ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అధికారికంగా విధుల్లో ఉన్న పోలీసుల నుంచి ఇలాంటి చర్యలు సహజంగా రావడం లేదు కాబట్టి.. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.
* జైలుకు తరలించే క్రమంలో..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో అసభ్య పదజాలాలతో దూషించారు అన్నది పోసాని కృష్ణ మురళి పై ఉన్న ప్రధాన ఆరోపణ. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఈయనపై కేసులను నమోదు అయ్యాయి. అయితే దాదాపు అన్ని కేసుల్లోనూ కృష్ణ మురళికి బెయిల్ లభించింది. అయితే ఈ దూషణల కేసుల్లో మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని సీఐడీ పీటీ వారంట్ ఇచ్చింది. ఇందుకోసం ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఒకరోజు కష్టడికి అప్పగిస్తూ సోమవారం ఆదేశాలు జారీచేసింది. దీంతో మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో జైలు నుంచి సిఐడి అధికారులు పోసాని కృష్ణమురళిని కస్టడీలోకి తీసుకున్నారు. సాయంత్రం ఐదు గంటల దాకా విచారణ చేపట్టారు. విచారణ ముగిసిన తర్వాత సిఐడి అధికారులు తిరిగి జైలుకు తరలించారు. అక్కడ వరకు బాగా నడిచింది. ఆయన వెంట వచ్చిన సిఐడి అధికారులు ఓ ఫోటో కావాలంటు కృష్ణ మురళిని కోరారు. దీంతో పక్కనే ఉన్న ఓ కానిస్టేబుల్ కు ఇచ్చిన సదరు అధికారి ఫోన్లో ఫోటో తీయించారు. అయితే ఈ విషయం బయటకు వచ్చింది. ఓ మీడియా సంస్థ దానిని సోషల్ మీడియాలో పెట్టేసింది. ఇది విపరీతంగా వైరల్ అవుతోంది.