Allu Arjun
Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ (Allu Arjun) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం. గంగోత్రి (Gangothri) సినిమాతో హీరోగా ఆయన ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పటికి ఆర్య (Aarya) సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతూనే ఉన్నాడు. ఈయన చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుండడంతో ఆయన కెరియర్ ను చాలా వరకు బిల్డ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు 1900 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక ‘పుష్ప 2’ (Pushpa 2) థాంక్స్ మీట్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ తనకు బాలీవుడ్ అంటే నచ్చదని హిందీ సినిమా అంటేనే తనకు చాలా హాయిగా ఉంటుందంటూ తెలియజేశాడు. ఇక అప్పటికే నిర్మాత రవిశంకర్ అప్రమత్తమై అల్లు అర్జున్ చెవిలో బాలీవుడ్ కి సంబంధించిన వివరణ ఇవ్వాలని చెప్పగా అప్పుడు అల్లు అర్జున్ మాట్లాడుతూ బాలీవుడ్ అనే పదం నాకు నచ్చదు దాని బదులు హిందీ సినిమా అంటే బాగుంటుందని నేను చెప్పాను అంతే అంటూ తను వివరణ అయితే ఇచ్చాడు. మరి ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో నెక్స్ట్ లెవెల్ హీరోగా ఎదిగిపోయాడు.
తను తర్వాత చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా విషయంలో ఆయన చాలా వరకు ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆయన ఆ సినిమాకి సైన్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే వీళ్ళ కాంబోలో సినిమా ఉంటుంది అనే వార్త వినిపిస్తున్నప్పటికి అఫీషియల్ గా ఈ సినిమాను ఇంకా అనౌన్స్ అయితే చేయడం లేదు. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్లో ఇంతకు ముందు మూడు సినిమాలు వచ్చాయి.
ఆ మూడు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ గా నిలవడంతో వీళ్ళ కాంబినేషన్ మీద భారీ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. మరి ఈసారి పాన్ ఇండియా సబ్జెక్టుని ఎంచుకున్న త్రివిక్రమ్ ఆ సినిమాతో ఏ మేరకు రాణిస్తాడు. తద్వారా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…