Upasana Konidela: నాకు రామ్ చరణ్ సినిమాల్లో ఆ రెండు తప్ప ఇంకేమీ నచ్చవు : ఉపాసన

రామ్ చరణ్ చిట్టిబాబు క్యారెక్టర్ లో చెవిటివాడు ఎలాగైతే నటిస్తాడో అలాంటి నటనని కనబరిచి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.ఇక తన బలం ఏంటో తను తెలుసుకున్నాడు అంటూ ఉపాసన రామ్ చరణ్ మీద సంచలన కామెంట్లు చేసింది.

Written By: Gopi, Updated On : November 16, 2023 4:05 pm

Upasana Konidela

Follow us on

Upasana Konidela: సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా మంచి గుర్తింపు పొందిన రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా తనదైన మార్కు చూపిస్తూ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు పొందుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈయన చిరంజీవి తనయుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చిరుత అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రామ్ చరణ్ మొదట్లో అన్ని రొటీన్ సినిమాలు చేశాడు. ఆ తర్వాత మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇదే విషయం మీద రాంచరణ్ భార్య అయిన ఉపాసన మాట్లాడుతూ రామ్ చరణ్ సినిమాల్లో తనకి చిరుత, మగధీర తప్ప ఆ తర్వాత వచ్చిన ఏ సినిమాలో కూడా అంత పెద్దగా నచ్చలేదు ఇక ఎప్పుడైతే రంగస్థలం సినిమా వచ్చిందో ఆ సినిమాకి నేను వీరాభిమానిగా మారిపోయాను ఆ సినిమాలో రామ్ చరణ్ నటన గాని, ఆయన పలికించే హావా భావాలు గాని చాలా అద్భుతంగా ఉంటాయంటూ చెబుతూనే రామ్ చరణ్ చిట్టిబాబు క్యారెక్టర్ లో చెవిటివాడు ఎలాగైతే నటిస్తాడో అలాంటి నటనని కనబరిచి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.ఇక తన బలం ఏంటో తను తెలుసుకున్నాడు అంటూ ఉపాసన రామ్ చరణ్ మీద సంచలన కామెంట్లు చేసింది.

నేను ఎక్కువ సినిమాలు చూడను కానీ రామ్ చరణ్ సినిమాలని చూడటానికి ట్రై చేస్తూ ఆయన అన్ని సినిమాలు చూసాను… అయితే మొదట్లో రామ్ చరణ్ చేసిన అన్ని సినిమాలు రొటీన్ సినిమాలు కావడం వల్ల ఆ సినిమా చూసే ఇంట్రెస్ట్ నాకు ఉండకపోయిన కూడా రామ్ చరణ్ కోసం ఆ సినిమాలు చూసేదాన్ని.ఇక రంగస్థలం ఎప్పుడైతే వచ్చిందో అప్పటినుంచి రామ్ చరణ్ సినిమాల సెలక్షన్ అద్భుతంగా ఉంటుంది అంటూ చెప్పింది.ఇక ఆ తర్వాత వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో అయితే ఏకంగా ఆయన్ని పాన్ ఇండియా స్టార్ ని చేసింది కాబట్టి ఇప్పుడు రామ్ చరణ్ అందరికీ నచ్చే హీరో అంటూ తను కామెంట్ చేసింది…

ఇక రీసెంట్ గానే వీళ్ల కి ఒక పాప కూడా జన్మించింది.ఇక ప్రస్తుతం రామ్ చరణ్ అటు సినిమాలు చేసుకుంటూనే, ఇటు ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక రెండింటిని సమపాలల్లో బ్యాలెన్స్ చేసుకుంటూ రామ్ చరణ్ తన కెరీర్ ని ముందుకు సాగిస్తున్నాడు… ఇక ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చెంజర్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబుతో సినిమా చేయడానికి కూడా రెడీ అవుతున్నాడు. ఇంకా గేమ్ చెంజర్ షూటింగ్ చివరి దశలో ఉన్న సందర్భం లో ఇక ఇప్పుడు బుచ్చిబాబు సినిమా పట్టాలెక్కించాలని చూస్తున్నాడు బుచ్చిబాబు సినిమాకి సంబంధించి ఆ సినిమాలో ఎవరెవరు నటించాలో ఆ నటీనటులను తీసుకుంటున్నట్టు గా తెలుస్తుంది…