Dil Raju : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ సినిమా గురించే చర్చ, రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం, అది కూడా #RRR వంటి సంచలనాత్మక చిత్రం తర్వాత రావడంతో కేవలం అభిమానులు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. టీజర్, ట్రైలర్, పాటలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా అన్ని కూడా సినిమా పై విపరీతమైన అంచనాలను ఏర్పాటు అయ్యేలా చేసింది. ఇకపోతే ఈ సినిమా విడుదల సందర్భంగా ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు నేడు కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఆయన ఈ సినిమా గురించి ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాము.
ముందుగా ఆయన మాట్లాడుతూ ‘ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజే ఈ చిత్రం గురించి చాలా మాట్లాడాలి అనుకున్నాము. కానీ జనాలు విపరీతంగా రావడంతో పోలీసులు తొందరగా ఈవెంట్ ని ముగించాలి సార్, ఫ్యాన్స్ బ్యారికేడ్స్ ని బద్దలు కొట్టేస్తున్నారు అన్నారు. అందుకే మా ప్రసంగాలను వేగంగా ముగించేసాము. కానీ ఇప్పుడు మాత్రం ప్రెస్ మీట్ లో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ చిత్రం నాకు, శంకర్, రామ్ చరణ్ గారికి ఎంతో ముఖ్యమైనది. కాబట్టి పెద్ద డైరెక్టర్ అయినప్పటికీ ధైర్యం చేసి శంకర్ గారికి ప్రతీసారి గుర్తు చేస్తూ ఉండేవాడిని బాగా తీయాలని, ఆయన ఇది నా కం బ్యాక్ సినిమా అవుతుంది అని చెప్పాడు. సినిమా ఔట్పుట్ చూసిన తర్వాత అంతకు మించి అని అర్థమైంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈసారి భారీ సిక్సర్ కొట్టబోతున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు మీ గురించి మాట్లాడుతూ మీరు వకీల్ సాబ్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ జనసేన పార్టీ ని నడిపించడానికి ఇంధనం అయ్యింది అన్నారు, దానికి మీ స్పందన ఏంటి అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు దిల్ రాజు సమాధానం చెప్తూ ‘వకీల్ సాబ్ చిత్రం జనసేన పార్టీ ని నడపడానికి ఇంధనం గా మారింది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పే వరకు నాకు తెలియదు. ఒక మంచి సినిమా ఇవ్వాలని అనుకున్నాను, అది తెలియకుండానే కళ్యాణ్ గారికి ఉపయోగపడింది. ఆయన ఆ మాట చెప్పేసరికి నా కళ్ళలో నుండి నీళ్లు వచ్చేసాయి. ఎవ్వరూ అంతటి పబ్లిక్ స్టేజి మీద, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఇలా మాట్లాడరు, అది ఆయన గొప్పతనం. అందుకు ఆయన పాదాలకు నమస్కారం చెయ్యాలి’ అంటూ చెప్పుకొచ్చాడు దిల్ రాజు.