I Bomma Ravi : చాలా సంవత్సరాల నుంచి పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీ చాలా వరకు నష్టపోతోంది….సినిమాలను పైరసీ చేసి ఐ బొమ్మ అనే సైట్లో పెట్టే ఈ బొమ్మ రవిని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక అతన్ని కోర్టులో సబ్మిట్ చేశారు… ఐ బొమ్మ రవి కోర్టులో జడ్జి ముందు తను లైవ్ లో ఎలా హ్యాక్ చేస్తాడో చేసి చూపించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మొత్తానికైతే రవి కి చాలా మంచి టాలెంట్ ఉందని గుర్తించిన జడ్జ్ దానిని ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ కి వాడటం సరైనది కాదని చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఎలాంటి సినిమానైనా సరే పైరసీ చేయగలిగే కెపాసిటి తనకు ఉందని జడ్జ్ కూడా నమ్మాడు… ఇంతకుముందు ఐ బొమ్మ లో వచ్చిన పైరసీ సినిమాలన్నింటిని తనే పైరసీ చేసినట్టుగా రవి ఒప్పుకున్నాడు. మొత్తానికైతే రవిని కోర్ట్ శిక్షిస్తున్న విషయం మనకు తెలిసిందే. కానీ రవిని ఆపడం ద్వారా పైరసీ ఆగిపోతుందా అంటే ఆగిపోదు… సినిమా ఇండస్ట్రీలో ఉన్న సినిమా ప్రొడ్యూసర్స్ వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలను చేయడమే కాదు దాన్ని పైరసీ కాకుండా ఆపుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే…
ఇక పైరసీ అవ్వకుండా ప్రొటెక్షన్ సిస్టం అంతా చాలా సెక్యూర్ గా ఉంచుకుంటే సరిపోతోంది కదా కోట్లు ఖర్చు చేసే సినిమా చేస్తున్నప్పుడు దానికోసం కనీసం ఒక కోటి రూపాయలు పెట్టైనా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది… ఇక పైరసీ లో సినిమా చూడడానికి చాలామంది ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.
కారణం థియేటర్లో విపరీతంగా టిక్కెట్ రేట్లు పెరిగిపోవడం, ఒక ఫ్యామిలీ మొత్తం థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తే దాదాపు 4000 వరకు ఖర్చు అవుతున్న ఈ రోజుల్లో ఒక సగటు మనిషి ఈ ఖర్చును భరించలేడు. కాబట్టే పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు. సినిమా వాళ్ళు సైతం కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు చేసే కంటే తక్కువ బడ్జెట్ లో సినిమాలను చేసి ప్రేక్షకులకు తక్కువ టిక్కెట్ రేట్ తో సినిమాలను అందిస్తే బాగుంటుంది.
అంతే తప్ప టిక్కెట్ రేట్లు ఇష్టమచ్చినట్టుగా పెంచితే జనాలు సైతం ఇలాంటివాటిని ఎంకరేజ్ చేయక తప్పదంటూ మరి కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి… చూడాలి మరి ఇకమీదట కూడా సినిమాలు పైరసీ అవుతాయా? లేదంటే దాన్ని అడ్డుకునే విధంగా ప్రణాళికలు ఏమైనా చేస్తున్నారా? లేదా అనేది తెలియాల్సి ఉంది…